అంతరిక్షవాసుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. అమెరికా సైనిక అధికారి చెప్పిన దానిని బట్టి మాకు నాలుగు ఎగిరే వస్తువులు కనిపిస్తే వాటిలో ఒకటి చైనా బెలూన్ గా గుర్తించాము మిగిలిన మూడు కూడా అనుమానాస్పదంగా కనిపించినా మొత్తం నాలుగు వస్తువులను అని చెప్పాడు. అయితే మళ్ళీ చైనా బెలూన్ ని పేల్చేసాం అని చెప్తే దానితో రేపు సంబంధాలు సరిగ్గా ఉండబోవు అనే అనుమానంతో మళ్లీ ఈ విషయాన్ని, ఆ వస్తువుని ఒక అంతరిక్ష విమానంగా పేర్కొంటూ మార్చి చెప్పారు. అయితే తర్వాత తెలింది ఏంటంటే ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త 12 డాలర్లతో వదిలిన బెలూన్ ని నాలుగు లక్షల డాలర్లతో పేల్చారు అనే విషయం ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యి పరువు పోయింది.


తాజాగా జపాన్ లోని ఇన్సు అనే సముద్రతీరంలో ఒక ఇనుప బాల్ లాంటిది కనబడింది. అది 1.5 మీటర్ల డయోమీటర్ తో, ఆరంజ్ ఇంకా బ్రౌన్ కలర్స్ లో ఉంటూ రెండు హ్యాండిల్స్ ని కూడా కలిగి ఉందట. దీనిపై చేసిన ఎక్స్-రే సర్వేలో అది బాంబు కాదనైతే తేలింది. ఇది డ్రాగన్ బాల్ పేరుతో నెట్ లో ప్రచారం అవుతూ ఉంది. అయితే ఇది స్పై బెలూన్ కూడా కాదని  జపాన్ చెప్తుంది. జపాన్ ఏ.ఐ కి సంబంధించిన ప్రోగ్రాం 820 స్టార్ సిస్టములకు సంబంధించి గ్రీన్లాండ్ టెలిస్కోప్ ద్వారా  అంతరిక్షంలో వెరిఫై చేస్తూ ఉంటుంది.


దీనికి 30 నుండి 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఐదు ఆబ్జెక్ట్స్ నుండి ఎనిమిది రకాల ఫ్రీక్వెన్సీలు వచ్చాయి అన్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు. వాస్తవంగా 1977లో కూడా ఇలాంటి ఫ్రీక్వెన్సీ 72 సెకండ్ ల పాటు వచ్చింది. దాని మీద అమెరికా వాళ్ళు జెర్రీనార్ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు. తర్వాత పరిశోధనలో వేరే చోట్ల అంతరిక్షవాసులు ఉన్నారన్నా  ధ్రువీకరణ అయితే కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: