ఆడపిల్లల పట్ల దారుణంగా ప్రవర్తించిన నేరస్థులకు కొద్ది రోజుల్లోనే శిక్ష పడితేనే న్యాయం జరిగినట్లు లెక్క.  అలాంటి దారుణమైన ఘటనలు చేయడానికి ఎవరూ రాకుండా శిక్షించాలి. లేకపోతే ఎవడికి వాడు ఇష్టమొచ్చినట్లు దాడులు చేయడానికి వెనకాడరు. కోర్టుల చుట్టూ తిరగలేకుండా బాధిత కుటుంబాలు పక్కకు వెళ్లిపోయినప్పుడు నేరం చేసిన వాడు దర్జాగా బయట తిరుగుతాడు. కానీ కోర్టు కీలమైన పని చేసింది.


ప్రేమను తిరస్కరించిందని యువతిని కత్తితో అత్యంత పాశవికంగా నరికి చంపిన ఉన్మాదికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ కాకినాడ మూడో అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పి. కమలా దేవి తీర్పును వెలువరించారు. అతి తక్కువ కాలంలో 144 రోజుల్లోనే విచారణ మొత్తం పూర్తి చేసి నిందితుడుకి శిక్ష పడేలా చేశారు.


కాకినాడ జిల్లా కురప మండలం కురళ్ల గ్రామానికి చెందినటువంటి దేవిక (21) ను తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం బాలవరం గ్రామానికి చెందిన సూర్యనారాయణ (27) అనే వ్యక్తి కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం కాండ్రేగులలో గతేడాది అక్టోబర్ 8న నడిరోడ్డున అతి కిరాతకంగా నరికి చంపాడు. మృతురాలి చిన్నాన్న బాలాజీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.


విచారణ వేగవంతంగా చేసి కోర్టులో అన్ని వివరాలు సమర్పించారు. పోలీసులు సమన్వయంతో పనిచేసి నేరం చేసిన వ్యక్తికి తొందరగా శిక్ష పడేలా చేశారు. దీని వల్ల మిగతా వారికి కూడా నేరం చేస్తే తొందరగా శిక్ష పడుతుందనే భయంతో చేయకుండా దూరం ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇలా అమ్మాయిలే అని కాకుండా ఎవరు చేసినా భయపడేలా తీర్పులు వచ్చినపుడే కోర్టులపై పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు ఉంటే ప్రజలకు విసుగు పుట్టి ఇక న్యాయం జరగదు అనే భావన పెరిగిపోతున్న తరుణంలో అతి తక్కువ కాలంలో ఇచ్చిన తీర్పు ప్రజల్లో విశ్వాసం పెంచేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

LAW