కార్పొరేట్ కాలేజీలలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడ ఆత్మ హత్యలు, విద్యకు సంబంధించిన పేపర్ లీకేజీలు జరుగుతుంటే గత కొన్ని రోజులుగా కాలేజీల దగ్గర ధర్నాలు, ఆందోళనలు, ఎస్.ఎఫ్.ఐ ఉద్యమం, ఏబీవీపీ ఉద్యమాలు, అరెస్టులు వీటన్నిటి వల్ల ఏమైనా జరుగుతుందా అంటే ఏమీ లేదు. ఈ చైతన్య, నారాయణలు దర్జాగానే ఉంటాయి. ఆ సంస్థల జోలికి ఎవరు వెళ్లరు. ఈ ఉద్యమాల పరంగా ఒక రకంగా కొంత ఖర్చవుతుంది, అంతకు మించి ఏమీ లేదు.


ఎందుకంటే ప్రభుత్వాలలో ఉన్నవాళ్లు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డిని విమర్శించిన వాళ్లు, తను వచ్చిన తర్వాత ఆ పేపర్ లీకేజీ కేసులో దొరికిన తర్వాత చైతన్యని కాపాడేసారు కదా. నారాయణ మీద యాక్షన్ తీసుకుని ఎన్నారై కి సంబంధించింది పక్కన పెట్టేసారు కదా. అంటే  ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి, ఒకటి ఫైనాన్షియల్  ఏస్పెక్ట్ ఉంది, రెండోది ఆధిపత్యం ఉంది. కేసీఆర్ 81/2ఏళ్లలో కనీసం కేజీ టు పీజీ అని స్కూళ్లకు పెట్టాం కదా అంటారు తప్పించి అక్కడ కార్పొరేషన్ దోపిడీ ఉంది.


ఆంధ్ర దోపిడీదారులను కేసీఆర్ ఏమైనా చేశారా లేదు. ఏమీ చేయరు. ఉపన్యాసాలు ఇమ్మంటే ఇస్తూనే ఉంటారు. ఒకవేళ కార్పొరేషన్ విద్యాసంస్థలను నిషేధించమంటే ఉద్యమించేది వీళ్ళ తల్లిదండ్రులే. ఈవేళ నా బిడ్డ చావకూడదు, కానీ వాళ్లకు ఫస్ట్ ర్యాంకులు వచ్చి తీరాల్సిందే, వాడికి ఎలా ఎక్కిస్తారో ఎక్కించమంటారు. ఏ చచ్చిపోయే పరిస్థితి వస్తేనో వీళ్ళు ఉద్యమిస్తారు అంతే.


అమ్మానాన్నలను చదువుకు సంబంధించి ఏదైనా అడిగితే నువ్వే చదువుకోవాలి, నాన్న ఎంత కష్టపడుతున్నాడు అంటారు. లేదంటే ఆస్తులు అన్ని నీ చదువుకు పోస్తాం, పోయి అర్థం చేసుకో అని చెప్పి పంపించేస్తారు వారి తల్లిదండ్రులు. అది కాకపోతే ఇంకొక దానిలోకి వెల్దువు ఆ బట్టిపట్టే చదువులు కాకుండా క్రియేటివ్ గా ఏదైనా చదువుకోమని చెప్పే తల్లిదండ్రులు 100కి 95% కూడా లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: