కెనడా అధ్యక్షుడి మీద దేశ ద్రోహం ఆరోపణలు చేస్తున్నారు అక్కడి విపక్షం నాయకులు. దీనికి కారణం చైనా వెనక నుండి ట్రూడోను నడిపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కెనడా 11 మంది పార్లమెంటు సభ్యులకు కూడా  చైనా డబ్బులు ఇచ్చిందని బయటపెట్టాడు. వీరు సిక్కు సభ్యులని భారత్ లో విధ్వంసం చేయాలని పాక్ చెప్పినందునే వారికి డబ్బులిచ్చినట్లు చెప్పాడు.


రెండు లక్షల డాలర్ల డబ్బులు ట్రూడో పౌండేషన్ కు చైనా నుంచి డబ్బులు వచ్చాయని కెనడా విపక్ష నేత ఆరోపించారు. ట్రూడో తండ్రి స్థాపించిన ట్రస్టుకు 2014, 2015 లో చైనా నుంచి డబ్బులు రావడంతో వాటినే ఖర్చు పెట్టి కెనడా ప్రధాని అయ్యారని ఆరోపించారు. 2016 లో వచ్చిన చైనా నిధులతో ఆ తర్వాతి కార్యక్రమాలు నడిపారు. జాంగ్ వెన్ అనే వ్యాపారి ద్వారా ఈ డబ్బులు ట్రూడోకు డబ్బులు అందాయి. 2019, 2021 లో కూడా డబ్బులు వచ్చాయి. జాంగ్ చైనా ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామి అని ఆరోపించారు.


కెనడాలో ఉన్న సిక్కు ఉగ్రవాదులకు కూడా ఇవి అందినట్లు ఆయన తెలిపారు. ఒవరాల్ గా దీని మీద దర్యాప్తు జరగాలని కోరారు. ఆధారాలను చూపించకున్న ట్రస్టు కు వచ్చిన డబ్బులే సాక్ష్యంగా చూడాలన్నారు. కోవర్టు ఆపరేషన్లు మాత్రం జరుగుతున్నాయని అన్నారు. దీని మీద కెనడా ప్రజాస్వామ్యం ప్రమాదం పడిందని ఆందోళనకు సిద్ధమయ్యారు. కెనడా ప్రభుత్వం మారిస్ రోసన్ బర్గ్ ను విచారణ అధికారిగా నియమించింది.


కానీ ఈయన ట్రూడోకు చాలా సన్నిహితుడు. ఇది నిజంగానే జరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే జీ20 సమావేశాలు జరిగినపుడు ట్రూడో, చైనా అధికారులు చాలా మాట్లాడుకున్నారు. జస్టిస్ ట్రూడో బ్యాచ్ మాత్రం చైనా తో ఏం డబ్బుల వ్యాపారం చేయలేమని చెప్పారు. కానీ చైనాతో ఉన్న అనుబంధాన్ని ఎంత తొందరగా తెంపేసుకుంటే అంత మంచిదని అభిప్రాయం కెనడా ప్రజల్లో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: