బీజేపీ వ్యతిరేక కూటిమికి అధ్యక్షుడిని చేస్తే దేశం మొత్తం మీద అయ్యే ఎన్నికల ఖర్చును పెట్టుకుంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారని సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ అన్నారు. దీని మీద ఇంతవరకు బీఆర్ఎస్ నాయకులు గానీ సీఎం కేసీఆర్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దానికి స్పందించడం స్పందించకపోవడం అనేది బీఆర్ఎస్ ఇష్టం. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, శరద్ పవార్ లాంటి నేతలకే నాయకత్వం ఇవ్వడానికే కాంగ్రెస్ ఒప్పుకోదు. అలాంటిది కేసీఆర్ కు దేశ వ్యాప్తంగా ఎలా నాయకత్వం ఇస్తారని అనుకుంటున్నారు.


అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవాలని చూస్తుంది. అందుకే దక్షిణ భారతంలో స్టాలిన్ ను దీని కోసం కార్యచరణ చేయమని ముందు నిలబడి ఏకం చేయాలని కాంగ్రెస్ కోరింది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకం ఉన్న పార్టీలను కేవలం బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మార్చి, కాంగ్రెస్ మద్దతిచ్చేలా చేయడం కాంగ్రెస్ చేస్తున్న వ్యుహం. దీనికి ఆయా ప్రాంతీయ పార్టీలకు హస్తం పార్టీ ఇస్తున్న హామీ రాష్ట్రాల్లో అధికారాన్ని మీరు చూసుకోండి. కేంద్రానికి వచ్చే సరికి మాకు మద్దతివ్వండి అని ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్ లో మాత్రం ఎక్కువ సీట్లు గెలిచేలా ప్రాంతీయ పార్టీలు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఆశిస్తోంది.


అయితే ఎక్కవ ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కు ఇచ్చేందుకు ఏయే ప్రాంతీయ పార్టీలు సహకరిస్తాయి. ఒకవేళ పొత్తులు కుదిరి ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కు కేటాయించాలని అనుకున్న ఎన్ని స్థానాలను ఇస్తాయి. సగానికి సగం ఎలాగో ఇవ్వలేవు. ఎందుకంటే వాటికి కూడా తమ ప్రాధాన్యం పార్లమెంట్ లో ఉండాాలని కోరుకుంటాయి. మరి స్టాలిన్ ఈ దిశగా అడుగులేస్తున్న తరుణంలో ఎన్ని సీట్లను కాంగ్రెస్ కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వేరే రాష్ట్రాల్లో ఎన్ని సీట్లను కాంగ్రెస్ కు ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారో త్వరలో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: