మోదీ ని ఇప్పటికి సీఎం జగన్ ఒక 20 నుంచి 30 సార్లు కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో సీఎం జగన్ మోదీ ని కలిస్తే అక్రమాస్తుల కేసుల జోలికి పోకుండా ఉండేందుకు కలిసి వేడుకుంటున్నారని ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేసేవారు. మోదీని ఈ మధ్య కలిస్తే వైఎస్ వివేకా హత్య కేసు నుంచి బయట పడేయాలని ప్రాధేయపడుతున్నారని ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారు.


వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం సీబీఐ రెండు ఛార్జీషీట్లను నమోదు చేసింది. ఇందులో వైఎస్ వివేకా ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను తీసుకునేందుకు హత్య చేసినట్లు దస్తగిరి సీబీఐ ఎదుట చెప్పారు. మరో కోణంలో ఎంపీ స్థానం కోసమే హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. జగన్ సీఎం అయ్యాక ఒక వేళ అరెస్టు అయితే వైఎస్ భారతిని సీఎం చేయకుండా వైఎస్ వివేకా అడ్డుకుంటారనే ఆయన్ని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ రెండు వివేకా హత్యకు సంబంధించి అర్థం పర్థం లేని ఆరోపణలుగా చెప్పొచ్చు.


ఉదయ్ కుమార్, లక్షీ అనే సాక్షులు తమల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లే అని సీబీఐ ముందు చెప్పారు. మేం చెప్పింది ఒకటైతే అక్కడ రాసింది మరొకటని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్నప్రధాన ఆరోపణలు జగన్ కి మోదీ, అమిత్ షా అభయం ఇచ్చేశారు. కేసు కొట్టేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం తమ నాయకులకు సంబంధించిన కేసుల గురించి మౌనం వహిస్తూనే కేవలం అధికార పక్షం జగన్ నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఒక వేళ మోదీ గనక జగన్ కు మద్దతు ఇచ్చి ఉంటే సీబీఐ ఎంక్వైరీకి ఎందుకు ఆదేశిస్తారు. దాని దర్యాప్తును ఎందుకు ముందుకు పోనిస్తారు. ఇలా రాష్ట్రంలో ఎవరికి వారు వైఎస్ వివేకా హత్య కేసు గురించి  ఇష్టారీతిన ఆరోపణలు చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: