తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వింగ్స్ మధ్య గట్టి పోటీ అయితే నెలకొంది ఇప్పుడు. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా మెలగాలనుకుంటున్నారు కానీ వాళ్ళ కేడర్ మెలగాలను కోవడం లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో కేడర్లు కలవలేదు. దాంతో తెలంగాణలో 2018 ఎలక్షన్ లో ఓటమి పాలయ్యింది. ఓటర్ కూడా వీళ్ళిద్దరి మధ్య కలిసేలా కనిపించడం లేదు.


ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్లు వీరాభిమానులు, వాళ్ళు పార్టీ కోసం ప్రాణం పెడతారు. పార్టీ నుండి ఏమి ఆశించరు. నరేంద్ర మోడీని గతంలో దారుణంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళకి గిట్టదు. అలాగే మోడీ చంద్రబాబు నాయుడును దేవుడుగా చూడట్లేదు అని ఈ పార్టీ కేడరు వాళ్ళ భావన. అసలు చంద్రబాబు ఆశీస్సుల వల్లే టీ అమ్ముకునే మోడీ సీఎం నుండి పీఎం గా ఎదిగారని వాళ్ల భావన.


చంద్రబాబు నాయుడు రాష్ట్రానికే కాదు దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ఏలగలిగే అంతటి శక్తివంతమైన నాయకుడు. అలాంటి ఆయన ఇదివరకు మోడీతో గొడవపడ్డాడు. కానీ ఆయన కలవాలనుకుంటే మోడీ ఎందుకు పరిగెట్టుకుంటూ రారు అంటూ వాళ్ళ లెక్కల్లో వాళ్లు భావించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా లో బిజెపి పోస్టుల పై వైఎస్ఆర్సిపి పెద్దగా పట్టించుకోదు కానీ, మహా అయితే ఒకటి రెండు కామెంట్లు పెట్టి వదిలేస్తుంది.


కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం రకరకాల కామెంట్లతో వెంటాడి, వేటాడుతున్నారు. ఈ మధ్యన జనసేనకి కూడా అది అలవాటు చేశారని తెలుస్తుంది. వీటన్నింటికీ బిజెపి వాళ్లు సమాధానం ఇస్తూ మాకు చంద్రబాబు నాయుడు పై కోపం కానీ మీకు మోడీ అంటే ద్వేషం. బిజెపితో కలిసి వెళతామని నాలుగేళ్లు ఉండి చివరికి ఓడిపోతామని తెలిసి సైడ్ అయిపోయిన చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు కోపం అని వాళ్ళు క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: