గడప గడపకు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో పాటు వాటిని అందరికీ అర్థమయ్యే విధంగా  స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఇందులో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయే పథకాలు ప్రవేశపెట్టారనే వివరాలతో స్టిక్కర్లను వేస్తున్నారు. అయితే ఇంటింటికీ జగనన్న భరోసా అనే విషయంలో చాలా మంది స్టిక్కర్ల అతికింపు పై వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.


గుంటూరు, కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గాలు బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి జగనన్న భరోసా, స్టిక్కర్ల వ్యవహారంపై అయిష్టత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరికి కూడా సంక్షేమ పథకాలు అందాయి. కానీ స్టిక్కర్లను అతికించుకోడంపై వ్యతిరేకత కనబరుస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వాడల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాంతాల్లో ప్రతి పథకం ఇంటింటికీ చేరింది.


కానీ ప్రభుత్వ అధికారులను కానీ, వైసీపీ నాయకులను కానీ మీ సొంత డబ్బులతో చేయడం లేదు కదా.. ప్రభుత్వం సొమ్ము అంటే అది ప్రజలు కట్టిన ట్యాక్స్ లతోో వచ్చిన సొమ్మును పథకాల రూపంలో మళ్లీ ప్రజలకే ఇచ్చి ఇంటింటికీ మేం స్టిక్కర్లు వేసుకుంటాం అంటే కుదరదని తెగేసీ చెబుతున్నారు. కొంతమంది వాటిని ఇళ్ల ముందు వేయడానికి ససేమిరా అంటున్నారు.


కొంతమంది డైరెక్టుగా మా ఇంటి వద్ద స్టిక్కర్ వేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే అలాంటి ప్రాంతాల్లో మీరు ఏమీ గొడవలు పెట్టుకోవద్దు. వాదనలతో పని లేదు. అలాంటి ప్రాంతాల్లో నుంచి వచ్చేయాలని ప్రభుత్వాధికారులు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి పథకాలు పొందిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారు దాదాపు 20 శాతంగా ఉన్నట్లు ఒక సర్వే లో తెలిసింది. వైసీపీ జగనన్న భరోసా మాత్రం ప్రభుత్వానికి మేలు చేసిందో లేదో తెలియదు కానీ తీవ్ర విమర్శలు మాత్రం ఎదుర్కొవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: