చైనా విషయంలో అమెరికా పరిస్థితి ఏమిటంటే, చైనా తో కలిసి ఉండలేదు, అలాగని దూరంగా కూడా ఉండలేదు. చైనా విషయంలో ఇప్పుడు అమెరికా పరిస్థితిని గురించి చెప్పాలంటే అసలు దేనిని ఉదాహరణగా చేసి చెప్పాలో కూడా అర్థం అవ్వని పరిస్థితి నెలకొంటుంది. అమెరికాలోని వ్యాపార సంస్థలు అక్కడ డబ్బులు సంపాదించడం కష్టం కాబట్టి చైనాకు చాలా వరకు వెళ్లిపోయాయి.


ఇక్కడ అమెరికాలో ఒక కార్మికుడికి పదివేల డాలర్లు ఇవ్వాల్సి ఉంటే, చైనాలో అదే 10,000 డాలర్లకి 10 మంది కార్మికులు దొరుకుతారు. చైనాలో రా మెటీరియల్ కూడా అక్కడ ప్రభుత్వమే సప్లై చేస్తూ ఉండడంతో అక్కడ రా మెటీరియల్ కూడా విరివిగా దొరుకుతూ ఉంటుంది. దాంతో అనేక సంస్థలు  చైనాలో స్థిరపడిపోయాయి. దాంతో ఇప్పుడు చైనా అమెరికా పక్క స్థానంలోకి వెళ్లి కూర్చుంది. అంటే చైనా ఇప్పుడు అమెరికా తర్వాత స్థానంలో, అమెరికా తర్వాత రెండో స్థానంలోకి వచ్చిందని తెలుస్తుంది.


అమెరికాకు ఇప్పుడు చైనా తనను ఆర్థికంగా కూడా ఆక్రమిస్తుందనే, అధిగమిస్తుందనే భయం ఏర్పడింది. రెండోది చైనా అమెరికా శత్రుత్వ కూటమికి నాయకత్వం వహిస్తుంది. అందుకని చైనాను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం పెట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలుస్తుంది. చైనా మరోపక్క అమెరికన్ డాలర్లను దెబ్బ కొట్టి, తన యువాన్ కరెన్సీని ప్రోత్సహించే విధంగా ఓ పక్కన పావులు కదుపుతుంది. అయితే ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు అమెరికా.


అందుకని చైనాను కొట్టబోయే మొదటి దెబ్బగా టెక్నాలజీ అంశంపై కీలకమైన నిర్ణయం తీసుకుంది. సెమీ కండక్టర్ చిప్స్, టెక్నాలజీ అప్డేటెడ్ ఎక్విప్మెంట్ చైనాకి బ్యాన్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది అమెరికా. ఇది డి కప్లింగ్ మాత్రం కాదు అని చెప్తుంది. అంటే దానిని పూర్తిగా వ్యతిరేకించడం కాదు, టెక్నాలజీ బదలాయింపులు మాత్రమే మానేశాం, మిగతా వ్యాపారాలు కొనసాగుతాయని అంటుంది. చైనాను దెబ్బ కొట్టాలంటే దానితో అన్ని వ్యాపారాలు మానేయాలని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: