ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.ఇప్పటికే పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారు.. వాటికి సంబంధించి నిధులను కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు.రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న వివిధ వస్తువులు మరింత నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సీఎం సూచనలతో ప్రమాణాలకు ఎక్కడా తగ్గకుండా వస్తువులను పంపిణీ చేయించేలా పాఠశాల విద్యా శాఖ దృష్టి పెట్టింది.ఇప్పటికే జగనన్న విద్యా కానుక వస్తువులకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వారి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా.. అక్కడక్కడ తలెత్తిన చిన్న చిన్న లోపాలు కూడా భవిష్యత్తులో ఉండకుండా చూసుకోవాలని నిర్ణయించింది.గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫారం మాత్రమే ఇచ్చేవారు. అదీ విద్యా సంవత్సరం ఆరంభమై ఏడెనిమిది నెలలు గడిచినా అందేవి కావు.


సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారం అందించేలా చర్యలు తీసుకున్నారు.ఈ కిట్ లో కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారంతో పాటు నోట్సులు, వర్కు బుక్కులు, షూలు, సాక్సులు, బెల్టులు, బ్యాగులు అందించేలా జగనన్న విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో రెండు జతల యూనిఫారం కాకుండా మూడు జతలు కూడా అందిస్తున్నారు. ఇంకా అలాగే దీనికి అదనంగా విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీలను కూడా సప్లై చేయిస్తున్నారు.అన్ని ఊళ్లలో కూడా ఒక్కో తరగతిలో ఒకరో ఇద్దరో పిల్లలు లావుగా ఉండొచ్చు. వారికి యూనిఫాం క్లాత్‌ సరిపోకపోయి ఉండొచ్చు. ఇకపై ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ సరిపడా రీతిలో మూడు జతల యూనిఫారం క్లాత్‌ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. దీంతో కుట్టు కూలీ మరింత పెంచి ఇచ్చే విషయం కూడా విద్యా శాఖ పరిశీలిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: