ఇటీవల అత్యంత వివాదాస్పదమైన ఏపీ మాజీ ఎన్నికల కమిషరన్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆయన కేంద్రానికి రాసిన లేఖ ఫోర్జరీ జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో నిమ్మగడ్డ – వైసీపీ జగడం వ్యవహారం మరోసారి మలుపు తిరిగింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కరోనా కారణంతో ఏపీలో అప్పటికే ప్రారంభమైన స్థానిక ఎన్నికలు వాయిదా వేయించడం గత నెలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

 

 

నిమ్మగడ్డ రమేశ్ చర్యపై ఏకంగా ముఖ్యమంత్రే ప్రెస్ మీట్ పెట్టి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయితే ఆ తర్వాత తనకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని ఏకంగా కేంద్రానికి నిమ్మగడ్డ లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. ఈమేరకు ఆ లేఖ కూడా మీడియా చేతికి వచ్చింది. అయితే నిమ్మగడ్డను మీడియా మీరే ఈ లేఖ రాశారా అంటే.. ఆయన దాన్ని ధ్రువీకరించలేదు. కానీ ధ్రువీకరణ కాని ఆ లేఖను తెలుగు దేశం అనుకూల పత్రికలు పేజీలకు పేజీలు ప్రచురించాయి.

 

 

ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. ఇంత జరిగినా కూడా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మీడియాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు. కనీసం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. ఆయన లేఖ రాశాడా లేదా.. అన్న విషయంపై కనీసం సమాచారం ఇవ్వలేదు. ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీకి మాత్రం.. ఆ లేఖతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఆ తర్వాత కరోనా విజృంభణతో ఈ విషయం పక్కకు వెళ్లింది.

 

ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో టీడీపీ గ్యాంగులో కలకలం రేగింది. ఈ వ్యవహారం టిడిపి నేతలు కనకమేడల రవీంద్ర, వర్ల రామయ్య, టిడి జనార్దన్ ల మెడకు చుట్టుకునేలా కనిపించింది. ఈ సమయంలో మళ్లీ నిమ్మగడ్డ ఎంట్రీ ఇచ్చారు. ఒక ప్రకటన చేశారు. లేఖ తాను రాసిందేనని, ఇందులో సందేహాలు అవసరం లేదని అన్నారు. మరి ఇన్నాళ్లూ నోరు విప్పని నిమ్మగడ్డ ఇప్పుడు నోరు విప్పుతున్నారంటే.. అది టీడీపీ నేతలను కాపాడటానికే అని అర్థం కావడం లేదూ..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: