కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న సమయంలో కొందరు దీన్ని ఆదాయ మార్గంగా మలచుకుంటున్నారు. ప్రత్యేకించి కొన్ని ఆసుపత్రులు కరోనా పేరిట దోపిడీ ప్రారంభించారు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి విషయాలు కొన్ని సీఎం జగన్ దృష్టికి వచ్చాయి. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఇలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఆరోగ్యశ్రీ, కోవిడ్‌ ఆస్పత్రుల జాబితాలో లేని ప్రైవేటు ఆస్పత్రులలో ఇష్టం వచ్చినట్లు ఫీజులు, రుసుములు వసూలు చేయకుండా చూడాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు.  అందుకోసం జీఓ నెం. 77, 78 ప్రకారం పక్కాగా అమలు చేయాలని... ఎక్కడైనా రోగుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేస్తే, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉందని... కోవిడ్‌ కష్టకాలంలో ఆస్పత్రులు రోగులను దోచుకోకుండా చూసేందుకు కఠినంగా వ్యవహరించాలని జగన్ ఆదేశించారు.

ఇక అన్ని కొవిడ్ ఆస్పత్రులలో సీసీ టీవీలు ఉండాలని... అది తప్పనిసరి.. అలాగే హెల్ప్‌ డెస్కులు కూడా ఉండి తీరాలి.. అవి రోజంతా పని చేయాలి.. ఆ రెండింటి ద్వారా ఆయా ఆస్పత్రులలో శానిటేషన్, ఫుడ్‌ క్వాలిటీ, వైద్యుల అందుబాటు, మందుల సరఫరా, ఆక్సీజన్‌ సరఫరాను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. గ్రామాల నుంచి ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలో కోరితే, వెంటనే 108 సర్వీసులు వెళ్లి రోగులను తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు.

అంతే కాదు.. కలెక్టర్లు 104 కాల్‌ సెంటర్‌ను ఓన్‌ చేసుకోవాలన్నారు. 104కు ఎవరు ఫోన్‌ చేసినా వెంటనే అటెండ్‌ చేయాలి.. రియాక్ట్‌ కావాలి.. అందువల్ల అవి ఎలా పని చేస్తున్నాయో తెలుసుకోవడానికి, రోజుకు రెండు, మూడు మాక్‌ కాల్స్‌ను కలెక్టర్లు చేయాలి... ఒక వేళ ఆ కాల్‌ సెంటర్‌ సక్రమంగా పని చేయడం లేదని గుర్తిస్తే, వెంటనే అన్నీ సరిదిద్దాలి. కాబట్టి 104 కాల్‌ సెంటర్లు సమర్థంగా పని చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: