అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపులు సహజమే. ఒత్తిడితులు తట్టుకోలేనివారు పార్టీలు ఫిరాయిస్తారు, తట్టుకోగలం అనుకున్నవారు మాత్రమే ప్రతిపక్షంలో ఉండి కష్టపడుతుంటారు, అవకాశం కోసం ఎదురు చూస్తారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నేరుగా నాయకులెవర్నీ టార్గెట్ చేయలేదు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి నేతల అరెస్ట్ లకు వేర్వేలు కారణాలుండటంతో ఎవరూ వాటిని వ్యక్తిగత వ్యవహారంగా చూడలేదు. ఇటీవల narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్, మాజీ మంత్రి దేవినేని ఉమా విచారణ పర్వంపై మాత్రం విమర్శలు వినిపించాయి. ఈక్రమంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీకి ప్రభుత్వం విద్యుత్ సరఫరా నిలిపివేయడం మరోసారి సంచలనంగా మారింది.
అమ రాజా సంస్థకు ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి క్లోజర్ నోటీసును జారీ చేసింది. ఈ సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో ప్రత్యక్షంగా 20 వేల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో 50వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. తాజా నోటీసులు, విద్యుత్తు సరఫరా నిలిపివేతపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. సంస్థకు సంబంధించిన పలు యూనిట్లలోని గాలిలో, మట్టిలో సీసం పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. అమర రాజా సంస్థ పర్యావరణాన్ని కలుషితం చేస్తోందని, ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసిందని, అందుకే మూసివేత ఆదేశాలిస్తున్నామని తేల్చి చెప్పింది.
మరోవైపు నోటీసులపై చట్టపరంగా ముందుకెళ్తామని అమర రాజా యాజమాన్యం స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం సహా అన్ని విషయాల్లో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నామని... యాజమాన్యం వెల్లడించింది. రూల్స్ పాటించామని ప్రభుత్వం చెబుతున్నా కూడా.. ప్రతిపక్ష నేతలు చెందిన కంపెనీ కావడంతో ప్రభుత్వం కావాలని కక్షసాధిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా టీడీపీ నేతల అరెస్ట్ లు, విచారణ పర్వాలు జరుగుతున్న వేళ, అమర రాజా వ్యవహారం జగన్ వైపు వేలెత్తి చూపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి