ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ సర్కారు, కేంద్ర సర్కారు మధ్య ప్రచ్చన్న యుద్ధం నడుస్తోంది. యాసంగి పంటను కేంద్రం కొననంటోందని తెలంగాణ సర్కారు ఆరోపిస్తోంది. అందుకే యాసంగిలో వరి పంట వేయొద్దని కేసీఆర్ పదే పదే రైతులకు చెబుతున్నారు. కేంద్రం కొననని తేల్చి చెబుతున్నందువల్ల వరి వేసి.. ఆ తర్వాత ఆగం కావద్దని కేసీఆర్ చెబుతున్నారు. అయితే.. రాష్ట్రంలో కేసీఆర్ మాట రైతులు వింటున్నట్టు కనిపించడం లేదు.


ఎందుకంటే.. కేసీఆర్ యాసంగి పంట వేయవద్దని కేసీఆర్ చెబుతున్నా.. చాలా చోట్ల రైతులు యాసంగి పంటగా వరిని సాగు ప్రారంభిస్తూనే ఉన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో తాజాగా బుధవారం నాటికి 400 ఎకరాల్లో వరి పంట వేశారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. విశేషం ఏంటంటే.. గతేడాది ఇదే సమయానికి ఒక్క ఎకరాలో నాట్లు వేయలేదు. కానీ.. ఈ ఏడాది మాత్రం అప్పుడే యాసంగి నాట్లు ప్రారంభించారు కూడా. గత యాసంగిలో నవంబరు రెండోవారం దాకా ఒక్క ఎకరంలో కూడా  నాట్లు పడలేదు. కానీ.. జనవరి నాటికి 52 లక్షల్లో వరి సాగు చేశారు.


కానీ.. ఈ సీజన్‌లో ఇప్పటికే 400 ఎకరాలకు పైగా వరి నాటు వేశారు. ఇక సీజన్ చివరి నాటికి  ఎన్ని ఎకరాలకు చేరుతుందన్నది అర్థం కాకుండా ఉంది. మరి గతేడాది తరహాలోనే 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే అప్పుడు రైతుల సంగతి ఏంటన్నది అర్థం కాకుండా ఉంది.  మేం ముందే చెబుతున్నాం కాబట్టి రైతులు వరి వేయకూడదని సర్కారు చెబుతోంది. కానీ సర్కారు మాట వినకుండా రైతులు వరి వేసినా.. మాకు బాధ్యత లేదని అప్పుడు ప్రభుత్వం తప్పించుకునే అవకాశం లేదు.


అందుకే ఈ యాసంగి సీజన్‌లో పండే వరి సర్కారుకు పెద్ద సమస్యగానే మారనుంది. ఎలాగైనా కేంద్రంతో పంట కొనుగోలుకు ఒప్పిస్తే పరవాలేదు. కానీ.. కేంద్రం మేం ముందే చెప్పాం కదా కొనమని అని మొండికేస్తే.. రైతులు ఆగం కాక తప్పదు. రైతులు కూడా ఈ విషయంలో ఆలోచించాలి. ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగు అవకాశాలను పరిశీలించాలి. ఈ సీజన్‌లో ఇప్పటికే పప్పుధాన్యాలు 2.67 లక్షలు సాగు ప్రారంభించారని నివేదికలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: