చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా ట్రంప్ హయాంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ భారత్ కలిసి క్వాడ్ గా రూపొందాయి. చైనా నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను సమిష్టిగా పరిష్కరించుకునేందుకు ఈ క్వాడ్ పనిచేస్తుందని ఆయా దేశాలు ప్రకటించుకున్నాయి. అనంతరం అమెరికాలో ట్రంప్ పోయి బైడెన్ పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం అకూస్ గా మూడు దేశాలు అమెరికా ఆస్ట్రేలియా, బ్రిటన్ లు కలిసి ఏర్పడ్డాయి.


ఇందులో బ్రిటన్ భారతదేశానికి ఒక ఆఫర్ ఇచ్చింది. అది ఏమిటంటే అకూస్ లో ఇండియాని కూడా కలుపుకుంటే బాగుంటుందని అమెరికాకు చెప్పింది. అకూస్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ  దేశాలపై  ఏ దేశమైనా దాడి చేస్తే మిలటరీ పరంగా సాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో ఇండియా కలవాలని బ్రిటన్ కోరుకుంటుంది. గతంలో అమెరికా కేవలం పాకిస్థాన్ కి మాత్రమే సాయం చేస్తూ ఇండియాని చిన్నచూపు చూసేది.


ఇండియా మిలిటరీ అన్నా కూడా అమెరికాకు నచ్చేది కాదు.  కానీ ట్రంప్ వచ్చిన తర్వాత  చైనా చేపడుతున్న దుశ్చర్యలను అడ్డుకునేందుకు క్వాడ్ ని తెరపైకి తీసుకొచ్చారు. దీని వల్ల ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఒక్కటయ్యాయి. అలాగే ఇప్పుడు అకూస్  వల్ల చైనా ను మిలటరీ పరంగా ఎదుర్కొనేందుకు అమెరికా వేస్తున్న ఎత్తుగడ.


భారత్ ఈ అకూస్ లో చేరితే న్యూక్లియర్ పరంగా మిగతా అణ్వస్త్రలపరంగా ఈ దేశాలు కొన్ని వివరాలు చెప్పాల్సి ఉంటుంది. మరి దీనికి ఆయా దేశాలు సమ్మతిస్తాయో లేదో చూడాలి. అదేవిధంగా భారత్ అకూస్ లోకి వస్తే ఫ్రాన్స్ ని కూడా చేర్చుకోవాలని కోరుతుందేమోనని బ్రిటన్ భావిస్తుంది. భారత్ కాకుండా మిగతా ఆసియా దేశాలు ఇందులో చేరితే అంతగా ప్రభావం ఉండదని బ్రిటన్ భావించింది. శ్రీలంక, నేపాల్,భూటాన్, లాంటివైతే అంత శక్తివంతమైనవి కావు. కాబట్టి ఇండియా ను  చేర్చుకుంటే బాగుంటుందని  ఆకూస్ కూడా బలంగా ఉంటుందని బ్రిటన్ అభిప్రాయపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: