
యాక్చువల్ గా టీచర్ గ్రాడ్యుయేట్ స్థానాలు అయిదే, మిగిలిన స్థానాలు ఎక్కువే కానీ ఎలక్షన్లకు ఇంకా ఏడాది కాలం ఉందనగా అంటే 15 నెలల కాలంలో మూడు నెలల కాలాన్ని పక్కన పెడితే కరెక్ట్ గా ఇంకో ఏడాది మాత్రమే టైం ఉన్న దశలో వచ్చిన ఈ ఫలితం తెలుగుదేశం అసలు పోటీలో ఉంటుందా లేదా అన్న పరిస్థితి నుండి తెలుగుదేశం పొజిషన్ ఇది అని తట్టి మరీ చూపించింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ మీద బలంగానే ఉంది. తెలుగుదేశం సాధించిన విజయాన్ని తక్కువ చేసి చూపించవచ్చు, కానీ అది ఎక్కువ విజయమే.
వైఎస్ఆర్సిపి పార్టీకి రానున్న కాలం గడ్డు కాలమే. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫలితంతో ఆ సొంత పార్టీలోని నాయకులే రేపొద్దున్న మాట వినని పరిస్థితి అయితే వస్తుంది. రఘురామ కృష్ణంరాజు లాంటి నాయకులు మరింత మంది ఆ పార్టీలో తయారవుతారు. ఇప్పటికైనా వైయస్సార్సీపి పరిస్థితిని అర్థం చేసుకుని ఏ గ్రాడ్యుయేట్ స్థానాల్లో అయితే ఓటమిని చవి చూసిందో, అదే గ్రాడ్యుయేట్స్ కి భవిష్యత్తులో భరోసా కల్పించే విధంగా, అది కూడా త్వర త్వరగా కల్పించే విధంగా ఉండాలి.
వాళ్లందర్నీ కన్విస్ చేసుకోగలిగాలి. కన్విన్స్ చేసుకోవడం అంటే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. తెలంగాణ గవర్నమెంట్ లాగా 9 ఏళ్ల పాలన చివర్లో హడావుడిగా నోటిఫికేషన్లు ఇచ్చి ఆ తర్వాత మళ్లీ అడ్డుపెట్టే విధంగా కాకుండా ఒక క్లారిటీ లో ముందుకెళ్లాలి.