పార్టీలకు సంబంధించిన పిటిషన్ లను ఎంకరేజ్ చేయబోమని... ఎందుకంటే మీ రాజకీయాల కోసం మా వ్యవస్థని వృధా చెయ్యొద్దని.. మీరు రాజకీయాలను వ్యవస్థలోనో లేదంటే జనాల్లోనో చేసుకోండి. అంతేగాని మా పని మమ్మల్ని  ప్రశాంతంగా చేసుకొనివ్వండి అంటూ గతంలో న్యాయస్థానాలు రాజకీయ నాయకులు వేసిన పిటీషన్లను తిరస్కరించాయి.


ఇలా ఏదైనా రాజ్యాంగ బద్ధమైన అంశాల మీద సవాల్ చేసినప్పుడు మాత్రమే అనుసరించేవారు. కానీ అక్కడ వేల కొద్ది కేసులు పెండింగ్ లో ఉన్నా, ఏవైతే రాజకీయ ప్రేరేపిత పిటిషన్లు ఉన్నాయో అవి ఇప్పుడు ఎలవ్  అవుతున్నాయి. తాజాగా 14రాజకీయ పార్టీలు సిబిఐ, ఈడి ఈ ఇద్దరిపై దుర్వినియోగం చేస్తున్నారని పిటీషన్ వేశారు. ఈ 14రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్ విచారించడానికి తాజాగా సుప్రీంకోర్టు అంగీకరించింది.


రేపొద్దున్న మరో 10 రాజకీయ పార్టీలు కలిసి న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడానికి వీల్లేదు, ప్రభుత్వమే నడపాలి అని చెప్తే, అని పిటిషన్ వేస్తే అనుమతిస్తారా! గతంలో ప్రభుత్వం వేస్తేనే అనుమతించలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి వేరే లాయర్లు పిటీషన్ వేసినా కూడా ఆ లాయర్ల మీదే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం. న్యాయవ్యవస్థకు సంబంధించి ఏ ప్రశ్న వేయకూడదు, ఏ విచారణకు అనుమతించం, అదే రాజ్యాంగంలోని మరో అంగమైనటువంటి వ్యవస్థలో మాత్రం మేం ఇన్వాల్వ్ అవుతాం, విచారిస్తాం అంటున్నారు ఇప్పుడు కొంతమంది.


సిబిఐ, ఈడిలో ఏమైనా తేడాలు ఉంటే బాధితుడు పిటిషన్ వేయాలి గాని, రాజకీయ నాయకులు పిటిషన్ వేయడం ఏంటి అని, రాజకీయ పార్టీలు పిటిషన్ వేయడం అంటే తమ తమ రాజకీయ పార్టీలోని నేతలు చేసే ఎలాంటి పనులైనా సమర్ధించడం కోసమా? దానిమీద కోర్టులు అసలు చర్చిస్తాయా, రాజకీయ పార్టీల మీద కేసులు వేయొద్దంటాయా, లేదంటే సిబిఐ, ఈడీలను నిషేధించేసి విదేశాల లోని సిఐఏ నుండి మనుషులను తెప్పించేసుకుంటారా? అసలు ఇక్కడ న్యాయంగా ఏం జరగాలి? ఏం జరుగుతుంది అని కొంతమంది మేధావులు వాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ED