చైనాకి భారతదేశం పోటీ వస్తుందని భావించి అందుకోసం మన చుట్టూ ఉన్నటువంటి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఇలా అన్ని దేశాలకూ అప్పులు ఇచ్చి వాళ్ళందర్నీ కంట్రోల్ లో పెట్టుకొని భారత్ కు వ్యతిరేకంగా లేదా తటస్థంగా ఉండేలా చేసి దెబ్బ కొట్టే ప్రయత్నం చైనా చేస్తే మనం దానికి అవతల ఉన్నటువంటి ఫిలిప్పీన్స్, తైవాన్ ఇట్లాంటి వాళ్లతో స్నేహం చేస్తూ వాళ్లకు చెక్కుపెట్టే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం.


వాళ్లకి ఆయుధాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఎవరి ఎత్తుగడలో వాళ్ళు నడుస్తున్నారు. ఇలాంటి సందర్భంలో చైనా-తైవాన్ యుద్ధం నేపథ్యంలో తైవాన్ ను దెబ్బ కొట్టడానికి ప్రత్యక్ష యుద్ధం చేస్తే అమెరికా యూరప్ దేశాలు వచ్చి తనపైన యుద్ధం చేస్తారేమో అని భయపడుతున్న చైనాకు ప్రపంచ యుద్ధానికి ధైర్యం చాలడం లేదు. రష్యా తోడు రానంటుంది ప్రపంచ యుద్ధానికి. నార్త్ కొరియా రానంటుంది, ఇరాన్ రానంటుంది.


ఎందుకంటే యుద్ధం జరిగితే రెండువైపులా విధ్వంసం జరుగుతుంది కాబట్టి. అందుకని చైనా తైవాన్ పైకి ఒంటరిగా యుద్ధానికి పోతే అన్ని దేశాలు కలిసి టార్గెట్ చేస్తే అప్పుల పాలై పోతుంది. అందుకని అక్కడ ఉన్నటువంటి తైవాన్ లోని సామ్ సుయ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆమెను దెబ్బ కొట్టడానికి అని చెప్పేసి ప్రతిపక్షాలను ఎంకరేజ్ చేసి అక్కడ స్థానిక ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించేలా చేసి రాజకీయంగా అక్కడ తన ఆధిపత్యాన్ని హాంకాంగ్ తరహాలో తయారుచేసుకుంటూ వచ్చింది.


ఈలోపు ఇతర దేశాలను క్రమంగా దాని నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. 18 దేశాలు మొన్నటి వరకు తైవాన్ చైనాలో భాగం కాదని గుర్తిస్తే ఇప్పుడు అది 13 కి పడిపోయింది. ఏదైతే ఆండ్యూరస్ అనే దేశం వన్ చైనా పాలసీకి ఒప్పుకున్న కారణంతో చైనా పాతిక వేల కోట్ల దాకా అప్పు ఇవ్వడానికి సిద్ధపడింది. ఈ విధంగా అక్కడ చైనా ఎత్తుగడలు కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: