దేశద్రోహి అనేవాడు ప్రక్కలో పాము లాంటివాడు. అలాంటివాడు దేశానికి చాలా ప్రమాదం. రాజుల కాలంలో దేశద్రోహులకు శిక్షలు సత్వరమే అమలు జరిగేవి. కఠినంగా కూడా ఉండేవి. దేశద్రోహం చేసిన నేరానికి ఆనాటి రాజులు ఉరి శిక్ష‌లు విధించేవారు. లేదంటే కఠిన కారాగార శిక్ష విధించేవారు అని తెలుస్తుంది. కానీ ఇప్పుడు వాళ్లకి అంత కఠిన శిక్షలు విధించడం లేదని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.


తమ దేశాన్ని నాశనం చేయడానికి తమ కుయుక్తులు సరిపోకపోతే  విదేశీయుల సహాయం తీసుకునేవారు వాళ్ళు. ఇలాంటి దేశద్రోహులు వల్లే అనేక రాజ్యాలు కుప్పకూలిపోయాయి. మరికొన్ని పరదేశీయుల హస్త గతం అయిపోయాయి. ఇలాంటి దేశద్రోహుల వల్లే మన భారతదేశం విదేశీయుల పాలనలోకి వెళ్లిపోయింది. వాళ్ల వల్లే డచ్ వాళ్లు, ఫ్రెంచ్ వాళ్ళు ఇలా అనేక మంది విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించారు.


ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దేశద్రోహం అనే దుశ్చర్య వల్ల దేశానికి ఎంత నష్టమో చెప్పడానికి. భరతమాతకు వందనం అనే నినాదంతో మొదలైన వందే భారత్ రైళ్ల పై కూడా ఈ దేశద్రోహులు తమ పైత్యాన్ని చూపిస్తున్నారన్నట్లుగా తెలుస్తుంది. అయితే వందే భారత్ రైళ్లపై గతంలో రాళ్లు విసిరిన వ్యక్తులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచిత్రం. వాళ్లకు శిక్షలు వేయడం కాదు కదా, వాళ్లపై ఎటువంటి కేసులు కూడా నమోదు చేయలేదట.


ఒక దేశానికి ప్రతీకగా తలపెట్టిన ఒక కార్యాన్ని ద్వేషించడం కూడా దేశద్రోహమే‌. ఫ్రాన్స్ లో ఇలాంటి దేశద్రోహులను ఉదారభావంతో వదిలేస్తే దానికి ఫలితంగా ఇప్పుడు ఫ్రాన్స్ తగలబడుతుందని తెలుస్తుంది. ఫ్రాన్స్ లో ఇప్పటి వరకు 2800దాడులు జరిగాయని తెలుస్తుంది. ఈ మధ్య వందే భారత్ ట్రైన్ ఒకటి ఇంజన్ తో దాని తయారైన ప్రదేశం నుండి వెళ్తూ ఉందట. అయితే దాని వీడియోని సోషల్ మీడియాలో పెట్టి వందే భారత్ ట్రైన్ ల పని అయిపోయింది అని వక్రంగా వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: