
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్న శనివారం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా లోకేష్ గాని నారా బ్రాహ్మణి గాని తమ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అదేమిటంటే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా సెప్టెంబర్ 30వ తారీకు శనివారం 7 గంటల నుండి 7:05 నిమిషాల వరకు అందరూ గంట మోగించాలని పిలుపు ఇవ్వడం జరిగింది.
తమ అందుబాటులో ఉన్నటువంటి ప్లేట్లు, కంచాలు స్పూన్ లతో గంట మోగించాలని వారు పిలుపునిచ్చారు. గతంలో కరోనా టైంలో ప్రధానమంత్రి కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి పిలుపే ఒకటి ఇవ్వడం జరిగింది. కరోనా విపత్కర సమయంలో విపరీతంగా ప్రాణ నష్టం జరుగుతున్న సందర్భంలో తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించిన డాక్టర్లకు చప్పట్లు కొట్టే కార్యక్రమాన్ని జరిపింది కేంద్ర ప్రభుత్వం.
అయితే దీనిపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్లు దారుణంగా విమర్శించడం జరిగింది. చప్పట్లు కొడితే కరోనా వెళ్లిపోతుందా, లేదంటే చప్పట్లు కొడితే మరణాలు ఆగిపోతాయా అని వీళ్ళు విమర్శించడం జరిగింది. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం విషయంలో కూడా ఇదే విధంగా ఆయనని విమర్శించారు. అలాంటి వాళ్లే ఇప్పుడు తిరిగి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. అయితే దీనివల్ల కోర్టు ఏమైనా బెయిల్ ఇస్తుందా లేదంటే జగన్ ఏమైనా మారతాడా అని అడుగుతున్నారు కొంతమంది.