
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కాసాని మాత్రం పోటీ చేయాల్సిందేనని చంద్రబాబు పై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి చంద్రబాబు కానీ లోకేశ్ గానీ ససేమిరా అన్నారు. ప్రస్తుతం కేవలం ఆంధ్ర పాలిటిక్స్ పైనే దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరి ఇలాంటి సమయంలో టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలుపుతుందని అంతా అనుకున్నారు. టీడీపీ మాత్రం కాంగ్రెస్ కే మద్దతు ఇస్తున్నట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంపాదకులు రాధా కృష్ణ తెగ వార్త కథనాలు ప్రచురించారు.
ముఖ్యంగా టీడీపీ నుంచి వెళ్లిపోయి అక్కడి కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్న రేవంత్ రెడ్డి, మిగతా నాయకులు గెలిచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇన్ని రోజులుగా టీడీపీ మద్దతు కాంగ్రెస్ కే ఉన్నట్లు కథనాలు ప్రచురించారు. టీవీల్లో డిబేట్ లు పెట్టి ఎన్నో చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ఇంత చేసినా కూడా టీడీపీ పార్టీకి సంబంధించి ఎక్కడా కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన రాలేదు.
అయితే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన విషయంలో రాధాకృష్ణ ఎలా చెబుతారని అందరూ ప్రశ్నించారు. అయితే తానే టీడీపీ కి నాయకుడనే విధంగా అనుకుని ఎక్కువగా ఊహించుకుని ఇప్పటి వరకు కాంగ్రెస్ కే మద్దతు ఉంటుందని రాసుకొచ్చారు. కానీ చివరకు టీడీపీ మాత్రం తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించడంతో ఒక్కసారిగా ఏం చేయాలో తోచక సైలెంట్ అయిపోయారు.