
అయితే సోనియా గాంధీ గాంధీ జన్మదిన వేడుకలకు సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చారు. ప్రస్తుతం వీహెచ్ హనుమంతరావు లాంటి నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేకపోతున్నారు అన్నది వాస్తవం. కానీ ఆయన పార్టీ సీనియర్ నాయకుడు. ఒకప్పుడు పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నేత. అయితే సోనియా గాంధీ బర్డ్ డే కేకును కట్ చేసే అర్హత ఒక్క వీహెచ్ కే ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చాలా బాధ్యాతాయుతంగా మాట్లాడారు. అంతేకాదు వీహెచ్ తో దగ్గర ఉండి మరీ కేక్ కట్ చేయించారు. ఒకరినొకరు కేక్ తినిపించుకొని సందడిగా గడిపారు. వీహెచ్ కూడా రేవంత్ రెడ్డిని కౌగిలించుకొని ఆనందబాష్పాలు కార్చారు.
మేం ఈ స్థితిలో కుర్చీలో కుర్చున్నాం అంటే వీహెచ్ లాంటి నాయకులు కార్యకర్తల కృషి ఫలితమే. డిసెంబరు 9 తెలంగాణ ప్రజలకు పండుగ. ఎందుకంటే అప్పటి కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభించిది ఆ రోజే. ఇచ్చిన మాట కోసం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబరు 7 న ఎల్బీ స్టేడియానికి సోనియా గాంధీ వచ్చిన సమయంలో తెలంగాణ తల్లిని చూశారు. లక్షలాది మందికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.
ఆమె ఒక్కసారిగా స్టేడియంలో అడుగు పెట్టినప్పుడు అందరూ నిల్చొని అభినందించారు. అప్పుడు ఆమె మోములో ఆనందం కనిపించింది. 2017 డిసెంబరు 9న మొదటిసారి గాంధీభవన్ లో అడుగు పెట్టాను. ఇప్పుడు సీఎం గా వచ్చాను. పదేళ్లుగా కార్యకర్తలు కేసులు మోస్తున్నారు. ప్రభుత్వం మీది. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అంటూ చాలా హుందాగా మాట్లాడారు.