
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు తన రాజకీయ జీవితంలోనే కాదు .. వ్యక్తిగత జీవితంలోను చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తీన్మార్ మల్లన్నతో వివాదం తర్వాత ఆమెకు మద్దతుగా ఎవరూ రాలేదు. కాంగ్రెస్ నేతలు అటు కవితది .. ఇటు మల్లన్నది ఇద్దరిది తప్పేనని వాదిస్తూ తెరపైకి వచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఆ పని కూడా చేయలేదు. అసలు ఆ విషయం మీద స్పందించలేదు. కవిత మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు. తనపై మల్లన్న దారుణమైన వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. కవితపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు సీరియస్ గా మారుతాయి. మల్లన్నను బీఆర్ఎస్ నేతలు గట్టిగా ఆడుకుంటారు. అయితే ఈ విషయంలో ఎవరూ పట్టించుకోలేదు. పైగా కేసీఆర్ విడుదల చేసిన సామెతలు పుస్తకంలోనే ఉందని మల్లన్న నిరూపించుకున్నారు.
కల్వకుంట్ల కవితకు అసలు బలం కుటుంబం. బీఆర్ఎస్ పార్టీ నే బలం.. పార్టీని కూడా కుటుంబమే అనుకోవాలి. కవిత ఇప్పుడు సొంత రాజకీయాలు చేస్తున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించబోనని ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వం లో వచ్చే ఎన్నికలలో గెలుస్తామని చెబుతున్నారు. దీంతో కెసిఆర్ - కేటీఆర్ ఇద్దరు కవిత తీరుపై ఆగ్రహంతో ఉన్నట్టు బిఆర్ఎస్ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. కవిత ఇప్పుడు చాలా దూరం ముందుకు వెళ్లారు. తెలంగాణ జాగృతిని విస్తృత పరిచారు. అయితే ఆ పార్టీ వాళ్లు కవితలు అంగీకరించడం లేదు. కవితను పట్టించుకునేది లేదని జగదీష్ రెడ్డి వాళ్ళు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు కవిత మళ్లీ కుటుంబంతో పార్టీతో సంబంధాలు పెంచుకోవాలంటే ఆమె ఒక అడుగు వెనక్కు తగ్గాల్సి ఉంటుంది. అలా తగ్గితే ఆమె రాజకీయాల నుంచి వైదొలగాలని కెసిఆర్ - కేటీఆర్ ఇద్దరు షరతులు పెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా కవిత రాజకీయం అడకత్తెరలో పోక చెక్కలా మారిందని చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు