పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. అధికారులు మొగ్గు చూపుతున్నా.. ప్రభుత్వం నుంచి తగిన సంకేతాలు రాకపోవడంతో వారు మిన్నకుంటున్నారు. ఈసారి కొత్తగా ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ విద్యాసంస్థల్లో ఇప్పటికే సీసీ కెమెరాలున్నాయి. అలాంటి 200 కేంద్రాల్లోనే సీసీ కెమెరాల నిఘా మధ్య పరీక్షలు జరగనున్నాయి. గత ఏడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పదో తరగతి పరీక్షలను కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ని