బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు.. ముఖ్యంగా మార్కెట్ నిపుణులకు మాత్రం షాక్ ఇస్తుంది. నిన్న ఓ మాదిరిగా కిందకు దిగి వచ్చిన బంగారం ధరలు.. నేటి మార్కెట్ లో మాత్రం జిగేల్ మంటున్నాయి. బంగారం ధర పరుగులు పెట్టింది. పైపైకి కదిలింది. నిన్న దిగొచ్చిన పసిడి రేటు ఈరోజు పెరగడం గమనార్హం. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది...ఇది నిజంగానే చేదు వార్త అనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్ లో ఓ మాదిరిగా ఉన్న రేట్లు ఇండియన్ మార్కెట్ లో మాత్రం దూసుకు పోతున్నాయి.


హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు ధరలను గమనిస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పైకి కదిలింది. దీంతో రేటు రూ.46,300కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.350 పెరుగుదలతో రూ.42,450కు చేరింది.బంగారం ధర పరుగులు పెడితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి రూ.800 పెరిగింది. దీంతో రేటు రూ.72,800కు ఎగసింది.


పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.. వెండి నగలపై ధర పెరిగిన కారణంగా అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. మార్కెట్ లో నగల కొనుగోళ్లను మాత్రం మహిళలు ఆపడం లేదు.అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్‌కు 0.29 శాతం తగ్గుదలతో 1710 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర క్షీణిస్తే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.73 శాతం తగ్గుదలతో 26.20 డాలర్లకు చేరింది. బంగారం ధరలు అనేవి..ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాల పై ఆధారపడి పెరుగుతుంటాయి. మార్కెట్ లో మరి రేపటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: