ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై మీడియా సంస్థ అధినేత శ్రవణ్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఓవైపు దర్యాప్తు సాగుతుండగా పోలీసులు CRPC 73 సెక్షన్ మోపడంసరికాదని మీడియా సంస్థ అధినేత శ్రవణ్ పేర్కొన్నారు. అరెస్టుకి అనుమతివ్వాలంటూ.. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలంటూ నాంపల్లి కోర్టులో మీడియా సంస్థ అధినేత శ్రవణ్ పిటిషన్ దాఖలు చేశారు. భారత్‌కి తిరిగొచ్చేవరకి ఫోన్‌లో అందుబాటులో ఉంటానని.. స్వదేశానికి వచ్చాక దర్యాప్తునకు సహకారం అందిస్తానని మీడియా సంస్థ అధినేత శ్రవణ్ తెలిపారు. ట్యాపింగ్ కేసులో తనకి ఎలాంటి పాత్రలేదని...చట్టవ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడలేదన్న శ్రవణ్‌..చట్టానికి లోబడే హైదరాబాద్‌లో 35 ఏళ్లుగా ఉంటూ వ్యాపారం ప్రారంభించినట్లు చెప్పారు.

ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం 15 మార్చి2024న లండన్ వెళ్లినట్లు మీడియా సంస్థ అధినేత శ్రవణ్ వివరించారు. 20 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న సోదరి బాగోగులు చూసుకునేందుకు  అత్యవసరంగా అక్కడకు వెళ్లినట్లు మీడియా సంస్థ అధినేత శ్రవణ్ తెలిపారు. గతంలో ఆమెకు తోడుగా ఉండేందుకు 2023 మేలో అమెరికా వెళ్లినట్లు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో శ్రవణ్‌ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: