
ఇకపోతే వ్యాపారస్తులేమో రూ.80 వేల నుండి రూ.85 వేల మధ్యలో వుంటే అటు కొనుగోలుదారులకు ఇటు అమ్మకపుదారులకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక మొన్నటి వరకు బంగారం పెరుగుతుంది కాబట్టి ముందుగానే బంగారం కొనుగోలు చేస్తే బెటర్ అని, చాలామంది అనుకున్నా.. అందులో భాగంగానే రూ.85వేలు, రూ.90 వేలు, రూ.95 వేల వరకు ఉన్నప్పుడు కొనుగోలు చేశారు. ఇక తర్వాత బంగారం విలువ లక్ష రూపాయలు, రూ. 1,02,000 గా పెరిగినప్పుడు.. హమ్మయ్య మనం కొన్న బంగారానికి మార్కెట్ పెరిగింది అని సంతోషపడ్డారు. అంతలోనే బంగారం ధరలు సడన్ గా రూ.98 వేలకు పడిపోవడంతో అటు బంగారం ఎక్కువగా కొనుగోలు చేసిన వారు కూడా కాస్త అయోమయంలో పడ్డారు.
బంగారం ఒక్కోసారి పెరుగుతూ.. ఒక్కోసారి తగ్గుతూ ఉండడం వల్ల అటు కొనుగోలుదారులు కూడా అయోమయంలో పడుతున్నారు. ఇక ఇలాగే ఉంటే బంగారం ధరలు పెరగవచ్చు. అయితే అది ఎంతవరకు పెరుగుతుంది రూ.1,25,000 వరకు వెళ్తుందా..? లేక తగ్గితే మళ్ళీ రూ.80,000 వరకు వస్తుందా అన్నది తెలియని పరిస్థితి. ఏది ఏమైనా అంతర్జాతీయంగా మాఫియా తగ్గితే తప్ప బంగారం ధరలు తగ్గవని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో బంగారం కొనాలా వద్దా అని కొనుగోలుదారులు లేదా అమ్మకపు దారులు పూర్తిస్థాయిలో అయోమయంలో పడ్డారని చెప్పవచ్చు.