
ఇక వెండి ధరలు కూడా ఒక్కసారిగా తగ్గు ముఖం పట్టింది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ .97 వేల రూపాయలు.. అంతకుముందు ట్రెండిగ్ ప్రకారం రూ .98,000 ఉన్న వెండి ఒక్కసారిగా వెయ్యి రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది.
అయితే ఇప్పటివరకు బంగారం ఆల్ టైం గరిష్టల నుంచి క్షీణించింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ పరంగా గత నెలలో(ఏప్రిల్) ఔన్స్ 3500 డాలర్ల వరకు ఉండగా తాజాగా పసిడి 10% వరకు క్షీణించింది.3150 డాలర్ల స్థాయికి పడిపోయింది. దేశంలో లక్ష రూపాయల వరకు బంగారం వెళ్ళిన.. సుమారుగా 7000 నుంచి 8 వేల రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశంలో జరిగిన ఉద్రిక్తతల కారణంగా.. సురక్షితమైన పెట్టుబడి భావించి చాలామంది బంగారాన్ని కొనడం వల్ల ఈ లోహానికి భారీగా డిమాండ్ ఏర్పడిందట.. అయితే టారిఫ్ వర్క్ దిగిన అమెరికా ,చైనా ఒక అవగాహనకి రావడంతో పాటుగా అటు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ ఉద్రిక్తతలు కూడా చల్లారడంతో పెట్టుబడులు పెట్టడం పైన ఇతర వాటి మీద ప్రజలు మక్కువ చూపడంతో బంగారం ధర దిగివస్తోందని విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు.