
బుధవారం రోజున ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.99,020 ఉన్నది.. సాయంత్రం 7:00 సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.03 లక్షల పలుకుతోంది.. వీటికి తోడు వెండి ధర కూడా కిలో రూ .1500 రూపాయల వరకు పెరిగింది. దీంతో రూ.1.14 లక్షలకు చేరింది. న్యూయార్క్ గోల్డ్ మార్కెట్ ప్రకారం ఔన్స్ 3,379 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి విషయానికి వస్తే ఔన్స్ 38.34 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
బంగారం ధర ఒక్కసారి పెరగడానికి ముఖ్య కారణం వాణిజ్య అనిశ్చితులే కారణమని విశ్లేషకులు తెలుపుతున్నారు. బంగారం ధరలు చూసి కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇండియా పై అదనంగా అమెరికా 25% వరకు శునకాన్ని విధించడంతో ఇరువురు దేశాల మధ్య కూడా వాణిజ్య విషయంలో అనిశ్చితి ఏర్పడిందంటూ సీనియర్ అనలిస్ట్ సౌమ్యల్ గాంధీ తెలియజేశారు.. చీప్ దిగుమతుల పైన కూడా 100% శునకాలను విధిస్తామంటూ ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో మరొకసారి వాణిజ్య యుద్ధం మొదలవుతున్నాయి. ఇవి బంగారాన్ని మరింత డిమాండ్ పెంచేలా ఉంటాయంటూ తెలియజేస్తున్నారు. అమెరికా ఫెడ్ రేట్లు తగ్గిస్తుందని అంచనాలు ఉన్నప్పటికీ డాలర్ విలువ క్షీణించడం వల్ల పసిడి వైపుగా పెట్టుబడులు ఎక్కువగా రావడానికి కారణం అవుతోందని విశ్లేషకులు తెలుపుతున్నారు.