దోమల వల్ల ఎంత భయంకరమైన జబ్బులు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దోమల సమస్య నుంచి విముక్తి పొందడానికి కెమికల్స్ తో కూడిన మందులు వాడతా ఉంటాం. కానీ వీటివల్ల కూడా చాలా ప్రమాదముంది. వీటిని న్యాచురల్ గా పారదోలే వాటిల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లల్లి వాసన దోమలను ఈజీగా దూరం చేస్తుంది. మినరల్ ఆయిల్ లో వెల్లుల్లిని ఇంకా లవంగాలను దంచి వేయాలి. ఈ నూనెను ఒక రోజంతా కూడా అలాగే ఉంచాలి. తరువాత ఈ నూనెను వడకట్టి ఒక స్ప్రే బాటిల్ లోకి మీరు తీసుకోవాలి. తరువాత ఇదే నూనెలో 2 కప్పుల నీళ్లు ఇంకా అలాగే ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత ఈ నూనెను మీరు స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల దోమలు చాలా ఈజీగా పారిపోతాయి. అలాగే దోమలను తరిమి వేయడంలో తులసి ఆకులు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి.ఇంటి పరిసరాల్లో తులసి చెట్టును పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా దోమలు రాకుండా ఉంటాయి. తులసి దోమల లార్వాకు మంచి విరుగుడుగా పని చేస్తుంది.


 తులసి ఆకుల నుండి తీసిన నూనెను ఉపయోగించడం వల్ల కూడా దోమలు ఈజీగా పారిపోతాయి. అలాగే ఈ నూనెను పిల్లలకు కూడా రాయవచ్చు. దీంతో వారి దరిదాపుల్లోకి ఈ దోమలు రాకుండా ఉంటాయి.ఇంకా దోమలను పారదోలడంలో పుదీనా కూడా బాగా పని చేస్తుంది. ఎందుకంటే దోమలకు పుదీనా వాసన నచ్చదు. ఈ పుదీనా ఆకులను ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడిని చర్మం పై రాసుకోవడం వల్ల కూడా దోమలు కుట్టకుండా ఉంటాయి. ఇంకా అలాగే నిమ్మగడ్డిని ఉపయోగించడం వల్ల కూడా మనం దోమలను చాలా ఈజీగా పారదోలవచ్చు. నిమ్మగడ్డి నుండి తీసిన నూనెను ఇంకా అలాగే ఆలివ్ నూనెను కలిపి దోమలు ఎక్కువగా ఉండే స్ప్రే చేయాలి. అలాగే ఈనూనెను చర్మానికి రాసుకోవడం వల్ల కూడా దోమలనేవి మనల్ని కుట్టకుండా ఉంటాయి.ఇంకా అలాగే వేపనూనెకు సమానంగా కొబ్బరి నూనెను కలిపి చర్మానికి రాసుకోవడం వల్ల కూడా ఈ దోమలు మనల్ని కుట్టకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: