సాధార‌ణంగా మెంతులు తెలియని వారు ఉండరు. ప్రతీ వంటగదిలో తప్పకుండా ఉండే వస్తువు ఇది.  ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. అలాగే మన భారతీయులు పురాతన కాలం నుండి మెంతులను ఉపయోగిస్తున్నారు. మెంతుల్లో ఉండే లక్షణాలు,పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి. మెంతులలో పీచు పదార్ధం సమృద్ధిగా వుంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. 

 

అంతేకాక యాంటీ యాక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు ఉత్పత్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగే ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు. మెంతులలో జుట్టు రంగును కోల్పోకుండా చేసే గుణాలు ఉన్నాయి. అందువల్ల వీటిని తరచుగా వాడటం వల్ల జుట్టు నెరవడం ఆలస్యమవుతుంది. మ‌రియు మలబద్దకం సమస్య ఉన్నవారు ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు నీటిలో నానబెట్టిన మెంతులను తింటే ఆ సమస్య నుండి బయట పడతారు.

 

మెంతులు మేదోవహ స్రోతస్సు మీద నేరుగా పని చేయటం వల్ల దీనిని కొలెస్టరాల్‌ని తగ్గించుకోవడానికి ఔషధంగా వాడుకోవచ్చు. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకి 10 నుంచి 20 గ్రాముల మెంతులు నాన‌బెట్టిన‌ నీళ్లను తీసుకుంటే మంచిది. అలాగే కఫానికి వాతానికి వ్యతిరేకంగా మెంతులు పనిచేయటం వల్ల జీర్ణక్రియలో ఆలస్యం, గ్యాస్, పొట్ట ఉబ్బరింపు తదితర సమస్యలతో కూడిన అజీర్ణాన్ని మెంతులు  సరిచేయగలుగుతుంది. మెంతులను పొడిగా చేసి అన్ని ఆహార పదార్ధాలపైనా చల్లితే ఆ పదార్ధాలకు రుచిని ఇవ్వడమే కాక మెంతుల గుణాలు శరీరానికి అంది ఆరోగ్యం పెంపొందుతుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: