క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. గ‌త కొన్ని నెల‌ల కింద‌ట చైనాలో పుట్టిన ఈ ప్రాణాంత‌క‌ మ‌హ‌మ్మారి.. ఇప్పుడు ప్ర‌పంచ‌దేశాల‌ను త‌న గుప్పెట్లో పెట్టుకుని.. ప్ర‌జ‌ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతోంది. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనా భూతం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఫ‌లితం ద‌క్క‌డం లేదు. దీంతో కరోనా కట్టడి కోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే  ఏ రోగమైనా మొట్టమొదట రోగనిరోధక శక్తిపైనే దాడి చేసి, గెలిచి ఆ త‌ర్వాత‌ మన శరీరాన్ని ఆక్రమిస్తాయి.

 

అందుకే క‌రోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పంజా విసురుతున్న కరనోనాను సమర్థంగా ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గమని హెచ్చ‌రిస్తున్నారు కూడా. అయితే రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారంలో పెరుగు కూడా ఒక‌టి. అవును! రోజూ పెరుగు తిన‌డం వ‌ల్ల‌ శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ఇన్ ఫెక్షన్లను నివారిస్తుంది. ఇక రెండు కప్పుల పెరుగును నాలుగు నెలల పాటు తింటే వ్యాధినిరోధకత ఐదు రెట్లు పెరుగుతుంది. వాస్త‌వానికి పెరుగులో ఉన్న బ్యాక్టీరియా హానికరమైన బ్యాక్టీరియా కాదు. మంచి బ్యాక్టీరియా. ఇది శరీరంలో ఉన్న అనేక రుగ్మతలను నివారిస్తుంది. 

 

అంతేకాకుండా.. పెరుగు మన శరీరానికి కావల్సిన విటమిన్ కె అందివ్వడంతో పాటు, అందులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ అనే బ్యాక్టీరియా శరీరంలో  తెల్ల రక్తకణాలను పెంచుతుంది. అలాగే సెక్స్ సామర్థ్యంను పెంచడంలో పెరుగు ఒక న్యాచురల్ పదార్థం. పెరుగు వంద్యత్వాన్ని తగ్గిస్తుంది. పురుషుల్లో వీర్యం యొక్క నాణ్యత పెంచుతుంది. ఇక పెరుగులో ఉన్న క్యాల్షియం ఎముకలకు, కండరాలకు, దంతాలకు బలాన్ని ఇస్తుంది.  రోజు పెరుగు తినవడం వల్ల రక్తప్రసవరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మ‌రియు నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం కూడా తక్కువట‌. కాబ‌ట్టి, పెరుగును డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంతో పాటు క‌రోనా నుంచి కూడా మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: