
చింత పండును తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఎందుకంటే చింతపండులో హైడ్రాక్సి సిట్రిక్ అధికంగా ఉంటుంది. ఇది ఫ్యాట్ పెరగకుండా చూసుకుంటుంది. దానివల్ల బరువు పెరగకుండా ఉంటారు.
చింతపండు గుజ్జులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అజీర్ణం, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి వాటిని నివారిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా డయేరియాను కూడా నివారిస్తుంది.
చింతపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా చింతపండు లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చింతపండు గాయాలు మానడానికి సహాయపడుతుంది. ఎందుకంటే చింతపండులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండడంవల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.
దగ్గు, జలుబు నుండి కూడా ఉపశమనం పొందడానికి చింతపండు బాగా ఉపయోగపడుతుంది. చింతపండులో అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.