సాధారణంగా మనం బజ్జీలు, ఆలుబొండాలు వంటి చిరుతిళ్లు వండుకున్నప్పుడు అందులో బేకింగ్ సోడా వేసుకుంటూ ఉంటాం. ఇంట్లో చేసే వంటల కంటే ఈ బేకింగ్ సోడాను ఎక్కువగా బేకరీ ఉత్పత్తుల్లోనే వాడుతుంటారు. ఈ సోడాను వంటల్లో వాడినప్పుడు మృదువుగా తయారవడానికి దీన్ని ఉపయోగిస్తారు. బేకింగ్ సోడా రసాయనిక నామం సోడియం బైకార్బొనేట్. పలు తీపి పదార్థాలు, కేకులు, ఎగ్ పఫ్, కర్రీ ఫప్ వంటి వాటిల్లో ఈ సోడాను వాడుతుంటారు. అయితే బేకింగ్ సోడా వల్ల వంటలకే ప్రయోజనం కాదు. పలు అనారోగ్య సమస్యలను కూడా సమర్థవంతంగా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నివారణకు బేకింగ్ సోడా ఎంతో పుష్కలంగా పని చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడాను కలిపి తాగితే కడుపులో ఉన్న గ్యాస్ తగ్గి పొట్ట ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కడుపులోని ఆమ్లాలను సమతుల్యంగా ఉంచడంతో కృషి చేస్తుంది.

ప్రతి రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి.. దానిలో తగినంత నిమ్మరసం వేసుకుని పరిగడపున తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ ద్రావణాన్ని తాగిన తర్వాత అరగంట వరకు ఏమీ తినకూడదు. ఇలా కొంత కాలం వరకు చేస్తే శరీరంలో ఉన్న ఫ్యాట్ కరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బేకింగ్ సోదాకు ఉందని, బాధితులు ఎవరైనా ఉంటే రోజూ ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి తాగాలని, దీంతో కిడ్నీలో రాళ్లు కరిగి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

పాదాల నొప్పులు, వాపులు తగ్గించడంలో బేకింగ్ సోడా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి..ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు సమస్యలు తగ్గిపోతాయి. శరీరంపై ఏదైనా పురుగు పాకినా లేదా కుట్టినా ఆ ప్రాంతంలో మంట, దురద, నొప్పి వస్తుంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కూడా బేకింగ్ సోడాను వాడుతుంటారు. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్‌కి కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లాగా చేసి ఆ ప్రాంతంలో రాయాలి. అలా చేయడం వల్ల కొద్ది సేపటికే మంట, దురద, నొప్పి కొంత ఉపశమనం లభిస్తుంది. చెమట వాసనను తగ్గించడంలో కూడా బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా, నీటి మిశ్రమాన్ని శరీరంపై కాటన్‌తో తుడుచుకుంటే సమస్య తీరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: