క‌రోనా ఉధృతి త‌గ్గింద‌నుకునే లోపే మ‌ళ్లీ మొద‌ల‌యింది. దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌లో వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతుంది . ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు ఎక్కువే న‌మోద‌వుతున్నాయి. దాంతో క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వాలు న‌డుం బిగిస్తున్నాయి . ఇక ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. రోజు రోజుకు వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. మరోసారి వైరస్ కట్టడికి కఠిన చర్యలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది . ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిబంధనలను పాటించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది . రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలు , వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల్లో కరోనా నిబంధనలను పాటించాలంటూ ఆదేశించింది. ఎప్పటికప్పుడు సానిటైజేషన్ చేయాలని పేర్కొంది. కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది .

అంతే కాకుండా దుకాణ సముదాయాలు, పరిశ్రమలలో నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దుకాణాలు మాల్స్ లో ప్రవేశించేతప్పుడు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయాలని సూచించింది . డైనింగ్ హాళ్లలో ప్రతి రెండు గంటలకు ఒకసారి కచ్చితంగా సానిటైజేషన్ చేయాలని తెలిపింది. అంతే కాకుండా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తప్పని సరిగా వ్యాక్సిన్ వేసుకోకునేలా చూడాలని యాజమాన్యాలను ఆదేశించింది. ఇక తాజాగా రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 31,165 మందికి కరోనా టెస్టులు చేయగా 218 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈరోజు 117 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 1795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 8,92,740 కేసులు నమోదయ్యాయి. ఇక వారిలో 8,83,759 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: