కరోనా కాలంలో ప్రజలు అందరు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి రక రకాల ఆహార పదార్ధాలను తింటూ ఉన్నారు.అయితే మన వంట ఇల్లే ఒక మందులు షాప్ అనే విషయం మనం గ్రహించాలి.  మన అనారోగ్యానికి సంబందించిన ప్రతి దానికి వంట గదిలోనే పరిష్కారం దొరుకుతుంది. అయితే ఈరోజు మనం మన వంటగదిలో నిత్యం డబ్బాల్లో ఉంచుకునే మిరియాల గురించి తెలుసుకుందాం. మిరియాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మిరియాలను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన వ్యాదినోరోధక శక్తి అనేది పెరుగుతుంది.మిరియాలను సుగంధ ద్రవ్యాల్లో ఒకదానిగా పరిగణిస్తారు. మన వంటిటి దినుసులలో, మాసాలలో మిరియాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రతి వంటకంలోనూ కొద్దిగా మిరియాల పొడి వేసుకుని తింటే చాలా మంచిది. అయితే ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటి వారికి మిరియాలు ఒక చక్కటి పరిష్కారాన్ని ఇస్తాయి.

మిరియాలు తినడం వలన శరీరంలో కొవ్వు ఎక్కువుగా పేరుకుపోకుండా చేసి శరీరంలో స్వేద ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఫలితంగా చెమట రూపంలో కొవ్వు కరిగిపోతుంది.అలాగే మిరియాలు మూత్ర విసర్జనను  సాఫీగా జరిగేలా చేస్తాయి.అలాగే మిరియాలు శరీరంలోని  కొలెస్ట్రాల్ యొక్క జీవక్రియను వేగవంతం చేసి మంచి కొలెస్ట్రాల్  స్థాయిలు పెంచడానికి సహాయపడుతుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.అంతే కాకుండా మిరియాలలో కొవ్వును కరిగించే గుణాలున్నాయి కాబట్టి ఒక నాలుగు ఐదు మిరియాలు తీసుకుని వాటిని తమలపాకు ఆకులలో  పెట్టుకుని ప్రతి రోజు మెత్తగా నమిలి మింగితే కనుక అధిక బరువు తగ్గుతుంది.అలాగే బరువు తగ్గడానికి ప్రతి ఒక్కరు ఉదయాన్నే తేనె, నిమ్మరసంను గోరు వెచ్చని నీటిలో తాగుతారన్న విషయం మనకు తెలిసిందే. అలా తాగేవారు వాటితో పాటు కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుని తాగి చూడండి ఇలా మిరియాల పొడి తాగడం వలన అధిక బరువు తగ్గుతారు.

ఇప్పుడు మార్కెట్లోకి బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ కూడా అందుబాటులోకి వచ్చింది కావున  ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో ఒక చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను వేసి తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు అందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకుని తాగితే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.అయితే బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశ్యంతో మిరియాల పొడిని అధికంగా తీసుకుంటే జీర్ణశయా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లో దొరికే మిరియాల పొడిని కల్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున మీరే ఇంట్లో మిరియాల పొడిని తయారుచేసుకుని డబ్బాలో నిల్వ ఉంచుకోండి.



మరింత సమాచారం తెలుసుకోండి: