ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రతి ఒకరు అన్నం వండుకోవడానికి కుక్కర్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రెజర్ కుక్కర్లో ఎలాంటివి వండిన సరే తొందరగా ఉడుకుతాయని అందరూ వీటిలోనే వంటలను చేస్తూ ఉంటారు. అయితే ప్రెజర్ కుక్కర్లో కొన్ని పదార్ధాలను వండడం వల్ల ఆహారం రుచి తప్పిపోతుందట. ప్రెజర్ కుక్కర్ లో ఉండకూడని పదార్థాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ వంటివి కుక్కర్ లో విజిల్ ఇప్పిస్తూ ఉంటారు.. కొంతమంది ఇళ్లల్లో మరికొన్ని సమయాలలో కుక్కర్ విజిల్ వినిపించేటప్పుడు సర్వసాధారణమైన శబ్దం సమయాన్ని ఎక్కువగా సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే త్వరగా ఉడికించడానికి కూడా కుక్కర్ ఉపయోగపడుతుంది. అయితే కొన్ని పదార్థాలను కుక్కర్లో వండకూడదట. బియ్యం అన్నం చేయడానికి ప్రెజర్ కుక్కర్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రెజర్ కుక్కర్ లో ఉడికించడం వలన  బియ్యంలో ఉండే పిండి పదార్థం అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది.. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయట.. కాబట్టి వీలైనంతవరకు ఎక్కువగా కుక్కర్లో అన్నం వండడం మానేయాలట.

మరొక పదార్థం బంగాళదుంపలు ప్రెజర్ కుక్కర్ లో వీటిని ఉడికించరాదు.. బంగాళదుంపలు ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. కాబట్టి బంగాళదుంప ను ప్రెజర్ కుక్కర్లో ఉడికించడం మంచిది కాదట.

ప్రెజర్ కుక్కర్ లో వండకూడని మరొక పదార్థం పాస్తా.. అయితే ప్రెజర్ కుక్కర్ లో పాస్తా వన్డే వారు చాలామంది ఉన్నారు. పాస్తా లో అధిక స్ట్రాచ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.. ఇది హానికరమైన రసాయనాలను విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి పాస్తా వండడం ప్రెజర్ కుక్కర్లో మంచిది కాదు.


పాల ఉత్పత్తులను ప్రెజర్ కుక్కర్లో ఉడికించరాదు.. ప్రెజర్ కుక్కర్లో పాలు లేదా జున్ను వంటి పాల ఉత్పత్తులను వండడం వల్ల అవి పగిలిపోయి మన వండిన వంటను పాడు చేస్తాయి.

ప్రెజర్ కుక్కర్ లో చేపలు వండడం మంచిది కాదు.. ఇవే కాకుండా మరికొన్నిటిని వండకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: