గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి 24వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1757: బొబ్బిలి యుద్ధం జరిగింది.
1886 : యాత్రా చరిత్ర ప్రకారం ఆదివారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్ర ప్రారంభించారు.
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
1966: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులైనది.

ప్ర‌ముఖుల జననాలు


1712: ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (మ.1786)
1905: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (మ.1976)
1924: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ. 2010)


ప్ర‌ముఖుల మరణాలు

1920: అమేడియో మొడిగ్లియాని, ఇటాలియన్ కళాకారుడు.
1966: హోమీ జహంగీర్‌ భాభా, అణు శాస్త్రవేత్త.
1980: ముదిగొండ లింగమూర్తి, సినిమా నటుడు.లింగమూర్తి పూర్వీకులు కాశ్మీర శైవులు. వీరి చరిత్ర కల్హణుని రాజతరంగిణి (12వ వతాబ్దం) అనే సంస్కృత గ్రంథంలో కన్పడుతుంది. ఉద్భటారాధ్యుడు జయాపీడుడు అనే రాజుకు గురువు. అతని వంశస్థులు వారణాసి వచ్చారు. వారి వారసుడు 12వ శతాబ్దంలో కాకతీయ ప్రభువైన మహాదేవుని పిలుపుపై ఓరుగల్లు వచ్చాడు. వారికి నల్గొండ జిల్లాలోని ముదిగొండ గ్రామం అగ్రహారంగా ఇచ్చారు.  
1981: కాంచనమాల, సినిమా నటి. (జ.1917)
1981: పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు. (జ.1906)
2005: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (జ.1958).2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. ఆయన భార్య పరిటాల సునీత ,ప్రస్తుతం రాప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. రవి తండ్రి పరిటాల శ్రీరాములు కూడా ఒక ప్రజానాయకుడు. భూపోరాటాల్లో కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచేలా కృషి చేశాడు. ఈయన కూడా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా దర్శకుడు ఎన్. శంకర్ శ్రీరాములయ్య అనే సినిమా తీశాడు. రవి జీవితం నేపథ్యంలోనే రాం గోపాల్ వర్మ , రక్త చరిత్ర (১ & ২)పేరుతో రెండు సినిమాలు తీశాడు. 
2018: కృష్ణకుమారి, సినిమా నటి. (జ.1933)

మరింత సమాచారం తెలుసుకోండి: