ఈరోజుల్లో మనం తరచుగా వింటున్న పదం లైంగిక వేదింపులు. వీటికి మహిళలే కాదు చిన్నపిల్లలు గురి అవుతున్నారనే వార్త విన్నప్పుడు చాలా కలవరం కలుగుతోంది. తల్లితండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు అయినా కాకపోయినా పిల్లల పట్ల, వారి ప్రవర్తన పట్ల దృష్టి సారించి ఉండటం మంచిది. మనం ఎంత సంపాదించినా, ఎన్ని సౌకర్యాలు అమర్చినా, మనం వారి శారీరిక, మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. తీరిక లేదు, ఎన్నింటికని సమయం కేటించాలి అని భావించకుండా మన జీవితంలో అతి ముఖ్యభాగమైన మన పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలు ఏదైనా విషయం చెపుతుంటే శ్రద్దగా వినండి.
మీకు వారి పట్ల శ్రద్ధ ఉంది అనే భావన, నమ్మకం వారికి కలిగించండి.పిల్లలు తరచుగా ఒకే విషయం ఫై ఫిర్యాదు చేసుంటే తప్పక అ విషయం పట్ల శ్రద్ధ వహించి, సమయం కేటాయించి అ సమస్యని పరిష్కరించాలి. అలాగే ఒక్కోసారి పిల్లల్లో ఈ మార్పుని కూడా తల్లితండ్రులు గమనించాలి. పిల్లలను లైంగికంగా వేధించే వారిలో కొందరు అసలు పిల్లలను ముట్టుకోకుండా వారి ప్రవర్తనతో పిల్లలలో ఆందోళన కలిగిస్తారు. కొందరు పిల్లలు చిన్నవారు, బలహీనులు కనుక వారిఫై తమ అధిపత్యం చూపించి వేధిస్తారు. తల్లితండ్రులుగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం పిల్లలను శారీరిక మానసిక వేధింపులకు గురి చేసేవారు పురుషులు మాత్రమే కాదు అలాంటి వ్యక్తులు స్త్రీలలో కూడా ఉంటారు అని.
మీ పిల్లలు తమకి సంతోషం కలిగించే విషయాలను మీతో పంచుకోవటానికి ఎంత ఉత్సాహంగా మీ దగ్గిరకి వస్తారో అదే విధంగా వారికి నచ్చనివి, భాధ కలిగించే విషయాలను కూడా మీతో పంచుకోగలిగే చనువు ఇవ్వండి. అలా అని పిల్లలకి ప్రపంచం అంతా చెడ్డవారితో నిండి ఉందనే భావం కలగనీయకండి. వారు చెప్పేది మీరు నమ్ముతున్నరనే భావన కల్పించండి. పిల్లలకు తమకు నచ్చని అంశాలు జరుగుతున్నప్పుడు తమని తాము ఏ విధంగా పక్కకు తప్పుకోవలో, తమని తాము ఎలా రక్షించుకోవాలో తెలియచేయండి. గొంతు విప్పి అరవటం ద్వార వారికి హాని కలిగించే వ్యక్తులు ఒక్క అడుగు వెనక్కి వెళతారు అని తెలియచేయండి. పిల్లల ధైర్యం అంతా వారి తల్లితండ్రులే. అందుకే మన జీవితంలో మన కెరీర్, సంపాదన ఎంత ముఖ్యమైనవి అయినప్పటికీ పిల్లల కోసం తగినంత సమయం తల్లి, తండ్రి ఇద్దరు కేటాయించాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి