
1). ఇంట్లో బొద్దింకలను బయటికి తరిమి వేయాలి అంటే ముఖ్యంగా.. ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులోకి కాస్త వెల్లుల్లి ముక్కలు వేసి , కలబంద మిరపకాయ గింజలను వేసి మూత పెట్టి ఆ నీటిని రెండు రోజుల తరువాత.. వాటన్నిటిని మిక్స్ చేసి.. తిరిగి అదే నీటిలో కలిపితే ఆ నీటినే స్ప్రేగా ఉపయోగించాలి. అయితే స్ప్రే చేసేటప్పుడు వంట గదిలో తినుబండారాల పైన స్ప్రే చేయరాదు. ముఖ్యంగా ఇది చాలా దుర్వాసన వస్తుంది.
2). వేప ఆకులు అనేక అభిషేక గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇవి ఎన్నో వ్యాధులను కూడా నయం చేస్తుంది. వేప ఆకులను బాగా నీటిలో మరిగించిన తర్వాత ఆ నీటితో ఇంటినంతా శుభ్రం చేస్తే బొద్దింకలు ఈగలు మటుమాయం అవుతాయి.
3). మన వంటింట్లో దొరికే బేకింగ్ సోడా కూడా బొద్దింకలు ఈగలు తరిమేయడానికి చాలా సహాయపడుతుంది. బేకింగ్ సోడాలోకి కాస్త బెల్లాన్ని కలిపి మిశ్రమం లాగా తయారు చేసి బొద్దింకలో ఉన్న ప్రదేశం చోట ఆ మిశ్రమాన్ని కాస్త చల్లితే బొద్దింకల నుంచి విముక్తి పొందవచ్చు.ఇక దోమల ద్వారా బాధపడుతున్న సరే ఇలాంటి వాటిని చేయడం వల్ల వాటి నుంచి మన విముక్తి పొందవచ్చు.