
కోడిగుడ్డు పీల్ అప్..
దీనికోసం రెండు స్పూన్ల కోడిగుడ్డు సోన తీసుకోని, అందులో ఒక స్పూన్ బియ్యంపిండి కలిపి,ముఖానికి అప్లై చేయాలి.ఇది బాగా ఆరిన అరగంట తర్వాత,మెల్లగా ఫీల్ ఆఫ్ చేయాలి.ఇలా చేయడం వల్ల,ముఖంపై మృతకణాలు మరియు టాన్ తగ్గిపోయి,ముఖం మెరుపును సంతరించుకుంటుంది. ఇందులో బియ్యంపిండిని వాడటం వలన,ముఖానికి గ్లాసిలుక్ ని ఇస్తుంది కూడా.
కీరదోస..
ఈ ఫీల్ ఆఫ్ కోసం రెండు స్పూన్ల కీరదోస గుజ్జు తీసుకొని,అందులో ఒక స్పూన్ తెల్లసోన వేసి,బాగా కలపాలి.ఆ తరువాత ముఖానికి అప్లై చేసి,ఆరనివ్వాలి.ఇది బాగా ఆరిన తర్వాత ఫీల్ ఆఫ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల,చర్మసమస్యలకు ఉపశమనం కలుగుతుంది.ముఖ్యంగా కీరదోస ముఖానికి మాయిశ్చరైజింగ్ గుణాలు అందించి,ముఖవర్చస్సును పెంచుతుంది.
పైనాపిల్..
దీనికోసం అరకప్పు పైనాపిల్ ముక్కలు,అరకప్పు బొప్పాయి ముక్కలు తీసుకుని,రెండు స్పూన్ల తేనె వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి.దీనిని ముఖానికి,మెడకు అప్లై చేసి,అరగంటసేపు ఆరనివ్వాలి.ఆ తరువాత మర్దనా చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల,మృతకణాలు తొలగిపోయి ముఖవర్చస్సు పెరుగుతుంది.ట్యాన్ సమస్యతో బాధపడేవారికి,ఇది మంచి టిప్ అని చెప్పుకోవచ్చు.
ఓట్ మిల్..
చర్మసమస్యలను తగ్గించుకోవడానికి ఓట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.దీనికోసం ఒక స్పూన్ ఒట్స్ తీసుకుని,అందులో రెండు స్పూన్ల పాలు వేసి,బాగా మిక్సీ పట్టి,ముఖానికి అప్లై చేయాలి.ఇది బాగా ఆరిన తర్వాత మర్దన చేస్తూ శుభ్రం చేసుకోవడంతో మృతకణాలు మరియు టాన్ తొలగిపోయి, ముఖవర్చస్సు పెరుగుతుంది.