నేటి కాలంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడే వారు చాలా ఎక్కువవుతున్నారు.చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇంకా కుటుంబం ఇలా రకరకాల ఒత్తిళ్లతో బాధపడే వారు మనలో చాలా మంది ఉన్నారు.అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరగడం వల్ల భవిష్యత్తులో మనం చాలా రకాల సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఇవి ఖచ్చితంగా తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తాయి. కాబట్టి వీటిని సాధ్యమైనంత దూరంగా ఉంచాలి.ఒత్తిడి ఇంకా ఆందోళన వంటి సమస్యల బారిన పడకుండా మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతిలో ఎక్కువగా గడపాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే నేటి కాలంలో పెద్దలు, పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్, వీడియో గేమ్స్ ఇంకా టివి వంటి వాటిని చూస్తూ కాలాన్ని గడుపుతున్నారు. వీటి వల్ల అనారోగ్య సమస్యలే తప్ప ఎలాంటి లాభం కూడా లేదు.అందుకే ఈ టివి, వీడియో గేమ్స్ ఆడడానికి బదులుగా కనీసం ఒక 30 నిమిషాల పాటు పచ్చిగడ్డిలో నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించడం వల్ల మనకు చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


 మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ప్రకృతిని ఆస్వాదించడం వల్ల ఒత్తిడి ఇంకా ఆందోళన వంటి సమస్యలు చాలా ఈజీగా దూరమవుతాయి. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండవచ్చు.ఇలా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇంకా ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఇలా 30 నిమిషాల పాటు ప్రకృతిలో నడవడం వల్ల రోజంతా చాలా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. దృష్టి, ఏకాగ్రత వంటివి కూడా పెరుగుతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది.ఇంకా కుంగుబాటుకు లోనవకుండా ఉంటారు. అలాగే అధిక రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు మన దరి చేరవు. ఈ విధంగా ప్రతి రోజూ 30 నిమిషాల పాటు రోజూ ప్రకృతితో గడపడం వల్ల మన శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుందని చాలా రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: