వారమంతా లేదా నెల అంతా ఒకే పని చేసి చేసి అలసట చెందిన శరీరానికి, మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించేది పర్యాటకం. పర్యాటన అనేది స్వదేశంలోనే కాక విదేశాల్లో కూడా చేస్తూ ఉంటారు చాలా మంది. దీనివల్ల పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందింది. ఇంకా చెప్పాలంటే పర్యాటక రంగం మీద ఆధారపడి మనుగుడ సాగిస్తున్నాయి చాలా దేశాలు. కరోనా విలయ తాండవం చేసిన సమయంలో ప్రపంచమంతా ఇంటికే పరిమితమైపోయిన పరిస్థితి.


అప్పుడు జనాల్లో వచ్చిన అసంతృప్తి చాలా దేశాల్లో పర్యటక రంగం మరింత విస్తృతం అవ్వడానికి కారణం అయిందని తెలుస్తుంది. ఒకరకంగా ఇది రివెంజ్ టూరిజం అని పిలిచేంత తరహాలో పెరిగి పోయిందని సమాచారం. అంటే పర్యాటకులు విపరీతంగా వచ్చి మీద పడుతుండడంతో చాలా దేశాలు పొమ్మనకుండా పొగ పెట్టే తరహాలో వారిపై పన్నులు విపరీతంగా పెంచుతున్నాయట. అయితే ఇప్పుడు వాళ్లు పన్నులు కూడా కడుతున్నారు కానీ పర్యటనలు మాత్రం తగ్గించడం లేదంట.


పర్యాటక ఆధారిత దేశంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని సమాచారం. పెరు, థాయిలాండ్ లాంటి దేశంలో అయితే హోటల్స్ అలాగే ఫ్లైట్ రేట్లు అన్నీ పెంచేసినా కూడా టూరిస్టులు ఎగబడి మరీ వచ్చేస్తున్నారట.  అక్కడి రోడ్లన్నీ టూరిస్టులతో నిండిపోతున్నాయని తెలుస్తుంది. నెదర్లాండ్స్ కు  20 మిలియన్ల టూరిస్టులు వస్తూ ఉండడంతో 150 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందట.


వెనిస్ ఆఫ్ నార్త్ అనే ప్రదేశంలో అయితే మ్యూజియం చూడడానికి, అలాగే క్రూయిజ్ షిప్ లో కెనాల్ చూడ్డానికి జనాలు విపరీతంగా తిరగడం వల్ల అక్కడ పొల్యూషన్ పెరిగిందని ప్రజలు బాధపడుతున్నారట. ఇప్పుడు గ్రీన్ కు 30 వేల మిలియన్ టూరిస్ట్ లు, స్పెయిన్ కు 8.3 మిలియన్ల టూరిస్ట్ లు వస్తున్నారని తెలుస్తుంది. ఇటలీలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల వల్ల ఒక సెల్ఫీకి 300 డాలర్ల ఫైన్, రోమ్ లో అయితే 250 డాలర్ల ఫైన్ వసూలు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: