ఈ మధ్యకాలంలో చాలామంది వారి చేతులారా వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకుంటూ వున్నారు.ఎందుకంటే పూర్వకాలంలో మన దేశపు అలవాట్లు,సాంప్రదాయాలు పాటించడంతో అప్పటివారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు.కానీ ఇప్పుడు పాశ్చాత్యపు పోకడలు మన దేశ సంప్రదాయ వంటలను,అలవాట్లను ఆవహించిన తర్వాత రకరకాల రోగాలను దరి చేర్చుకుంటూ ఉన్నాము.ఇలాంటి రోగాలను దూరంగా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహారాలను తరచూ తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.ఇందులో ముఖ్యంగా రోజు ఒక స్పూన్ నువ్వులను తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.అసలు రోజుకు ఒక స్పూన్ నువ్వులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండీ..

వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్,డయేటరీ పైబర్స్ , విటమినన్ ఈ,జింక్ పుష్కళంగా లభిస్తాయి.

వీటిని తరచూ పిల్లలకు ఒక స్పూన్ మోతాదులో ఇవ్వడం వల్ల,మెదడు పనితీరుకు కావాల్సిన జింక్ పుష్కలంగా అంది,వారి ఆలోచన మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది.అంతేకాక పెద్దల్లో కూడా మతిమరుపుతో బాధపడేవారు రోజుకు ఒక నువ్వులను తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

మలబద్ధకంతో బాధపడేవారికి ఇందులోని డైయేటరీ ఫైబర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.ఇటువంటి వారు నువ్వులను బాగా వేయించి,తేనేతో పాటు తీసుకోవడం వల్ల వారి మలబద్ధకంకు తొందరగా ఉపశమనం కలుగుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారమని చెప్పవచ్చు.ఇందులో పుష్కలంగా ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని కరిగించడంలో చాలా బాగా పనిచేస్తుంది.దీనితో తొందరగా బరువు తగ్గొచ్చు కూడా.

ఈ మధ్యకాలంలో చాలామంది స్త్రీలు పిసిఒడి,pcos వంటి హార్మోనల్ సమస్యలు,మగవారిలో testostiran లెవెల్స్ తక్కువగా ఉండడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది.వారికి కూడా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసే శక్తి నువ్వులకు ఉంటుంది.కనుక వారు కూడా రోజుకొక స్పూన్  నువ్వులను తీసుకోవడం చాలా మంచిది.మధుమేహంతో బాధపడే వారికి కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి.

గుండె సమస్యలు తగ్గించడానికి..

నువ్వులలో లభించే ఒమేగా త్రీ ప్యాటి యాసిడ్స్ గుండె చుట్టూ ఉన్న అనవసరమైన కొవ్వును కరిగించి,గుండె సమస్యలు దరిచేరకుండా కాపాడుతాయి.కావున ప్రతి ఒక్కరూ రోజుకు ఒక స్పూన్ నువ్వులను ఏదో ఒక రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: