కరోనా వల్ల చాలామంది ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కరోనా భారి నుంచి బయటపడడానికి చాలామంది హ్యాండ్ వాష్, సబ్బులు, శానిటైజర్స్ వంటివి ఎక్కువగా ఉపయోగించేవారు.. కరోనా చాలామందినీ ప్రపంచంలో గందరగోళానికి గురిచేసింది.. ఇప్పటికీ కూడా కరోనా పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి.. 2019 తర్వాత శానిటైజర్ల వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికీ కూడా వీటికి మంచి డిమాండ్ ఉన్నది.. కానీ దుష్ఫలితాలను మాత్రం ఎవరు వివరించలేకపోతున్నారు. ఇటీవలే ఒక పరిశోధనలు విస్తీ పోయే నిజాలు బయటపడ్డాయి.


శానిటైజర్ లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలోని మెదడు భాగానికి చాలా హానికరం అంటూ పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇటీవల ఒక పరిశోధనలో మెదడు కణాల పైన చేసిన ప్రయోగంలో క్రిమి సంహారకానికి ఉపయోగించేటువంటి రసాయనాల వల్ల మన మెదడు చాలా హానికరానికి గురవుతుందని వెల్లడించారు.. ముఖ్యంగా బట్టలు, వస్తువుల పైన, ఫర్నిచర్ల పైన ఉపయోగించే రసాయనాలు మెదడుకు తీవ్రస్థాయిలో ఇబ్బందులను గురిచేస్తాయట. అలాగే అవయవాల పెరుగుదలకు కూడా ఆటంకం కలిగిస్తుందని పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు.



ముఖ్యంగా మన శరీరంలో ఉండే నరాలకు మద్దతు ఇచ్చే కొన్ని కణాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయట. ఇది శరీరంలోని వివిధ అవయవాలకు సైతం వ్యాపించి మెదడుకు సంకేతాలను ప్రసారం కాకుండా అడ్డుకుంటాయట.. మొత్తం మీద శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు ఇతర ఉత్పత్తి పరికరాల పైన వాడేటువంటి రసాయనాల వల్ల నాడి వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావం చూపుతోందని నిపుణులు తెలియజేస్తున్నారు..అలాగే ఇది మెదడు అవయవాల పనితీరుకు సైతం ఆటంకం కలిగిస్తుందని వెల్లడిస్తున్నారు. శానిటైజర్లు ఎక్కువగా ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందట. దీనిని తయారు చేసేటప్పుడు కాస్త క్రిమి నాశకపదార్థాలతో తయారు చేస్తున్నట్లుగా వైద్యులు గుర్తించారు.. అందుకే హ్యాండ్ శానిటైజర్లు వాడడం వల్ల చర్మం పైన కొన్నిసార్లు దురద పెట్టడమే కాకుండా అలర్జీ గా కూడా ఏర్పడుతుందట. అలాగే హార్మోన్ల పై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనివల్ల సంతాన ఉత్పత్తి పైన ప్రభావం పడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: