గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అయితే అనుకున్నంత ఈజీ కాదు ఇలా ప్రపంచ రికార్డు సృష్టించడం. ఎందుకంటే ఒకే విషయంపై ఏళ్ల తరబడి సాధన చేసి ప్రపంచంలో ఎవరూ చేయలేని విధంగా ఆ పనిని మనం చేసినప్పుడు మాత్రమే ప్రపంచ రికార్డు సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఎంతోమంది ఇలాంటి రికార్డు కొట్టేందుకు ఇక ఎంతో ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేయడం చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఏకంగా ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టే విన్యాసాలు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.



 కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇంత సులభంగా కూడా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించవచ్చా అనే విధంగా కొంతమంది రికార్డులు కొడుతున్నారు. రోజు చేసే పనులనే అందరికంటే కాస్త కొత్తగా ప్రయత్నించి చివరికి ప్రపంచ రికార్డులను సాధిస్తున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రోజు వ్యాయామం చేసే సమయంలో ట్రెడ్ మిల్ ఎక్కి రన్నింగ్ చేయడం చేస్తూ ఉంటారు.



 అయితే ఇక్కడ ఒక యువకుడు ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేయడం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు. ఓస్ అంతేనా మేము కూడా ఇలా రికార్డు సృష్టించవచ్చు అయితే.. అని అనుకుంటున్నారు కదా. అలా అనుకున్నారంటే పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే భారత ఆల్ట్రా మారతాన్ రన్నర్ సుమిత్ సింగ్ లో ట్రేడ్ మిల్ ఫై పరిగెత్తి గిన్నిస్ రికార్డు సృష్టించడానికి చాలానే కష్టపడ్డాడు. ఎందుకంటే ఏకంగా 12 గంటల పాటు ఆపకుండా ఇలా పరుగు పెట్టాడు. మార్చు 12 ఉదయం 8:15 గంటల నుంచి పరుగు ప్రారంభించిన అతను రాత్రి 8:20 గంటల వరకు పరుగు కొనసాగించాడు. మొత్తంగా 68.94 కిలోమీటర్లు పరిగెత్తడంతో అతని ఖాతాలో ఇలా ప్రపంచ రికార్డు వచ్చి చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: