
చేతులను ముందు వైపుకు నెమ్మదిగా నెట్టాలి. కాళ్లను నేరుగా ఉంచి, తల నేలవైపు వంచాలి. ఈ స్థితిని 1–2 నిమిషాలు పట్టుకోండి. విపరీత కరణి, శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. థైరాయిడ్ ఫంక్షన్ మరియు హార్మోన్లను సమతుల్యంలో ఉంచుతుంది. జుట్టు పోషణకు ఇది సహకరిస్తుంది. పిరుదులను గోడకు దగ్గరగా పెట్టి, కాళ్లను గోడపైకి నిలువుగా ఎత్తాలి. చేతులు పక్కగా ఉంచాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ 5–10 నిమిషాలు పైనే ఉంచాలి. ఉష్ట్రాసనం, తలవైపు రక్తప్రసరణ పెరగడం ద్వారా జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది. ఛాతీ, మెడ భాగాల టెన్షన్ తగ్గుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ బాగుంటుంది. మోకాళ్లపై నిలబడి, వెనక్కి వంగి చేతులతో మడిమలు పట్టాలి. తలను వెనక్కి వంచాలి.
30 సెకన్లు ఆ స్థితిలో ఉండి, తిరిగి వేదిగా నేరుగా రావాలి. పవన ముక్తాసనము, పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. టాక్సిన్లు బయటకు పోతాయి. జీర్ణక్రియ మెరుగవడంతో జుట్టుకు అవసరమైన పోషకాలు అందుతాయి. నిద్రించే స్థితిలో ఉండి, కాళ్లను మడిచి వాపు దగ్గరకి తీసుకురావాలి. చేతులతో గట్టిగా పట్టుకుని తలని మోకాలపై ఉంచాలి. 30–60 సెకన్లు ఆ స్థితిలో ఉండాలి. బలాసనము, మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. శ్వాస వ్యవస్థ మెరుగవుతుంది – ఇది జుట్టుకి అవసరం. మోకాళ్లపై కూర్చొని, ముందుకు వాలిపోవాలి. చేతులు ముందుకు చాపి, తల నేలపై ఉంచాలి. 1–2 నిమిషాలు అలాగే ఉండండి.