
ఆహారంలో మార్పులు చేసే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కేవలం బరువు తగ్గడం కోసం అన్నం మానేయడం కంటే, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. అలాగే వ్యాయామం చేయడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు.
అన్నం తినడం మానేయడానికి బదులుగా బ్లాక్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ను తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు. షుగర్ వస్తుందనే భయంతో పూర్తిస్థాయిలో అన్నం మానేస్తే మాత్రం లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని గుర్తుంచుకోవాలి. తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అన్నం సులభంగా జీర్ణం కావడంతో పాటు కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ రైస్ తీసుకోవడం ఎంతో సేఫ్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. అయితే ఇప్పటికే మధుమేహం సమస్యతో బాధ పడుతున్న వాళ్ళు సైతం తీసుకునే రైస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనాలు చేకూరుతాయి.