
అంతకముందు 2014లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పాతపట్నంలో పోటీ చేసి జగన్ గాలిలో గెలిచేశారు. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా సరే శాంతి....నియోజకవర్గంపై పట్టు తెచ్చుకోలేదు. ప్రభుత్వం తరుపున వచ్చే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ఎమ్మెల్యేకు ప్లస్ అంతే. ఇంకా ఏది కూడా ఎమ్మెల్యేకు ప్లస్ కనిపించడం లేదు. నియోజకవర్గంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వంశధార నదికి కళింగపట్నం నుంచి బత్తిలి వరకు కరకట్టలు నిర్మాణం చేయాల్సిన అవసరముంది.
అలాగే తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి..శుద్ధమైన మంచినీరు అందించాల్సిన అవసరముంది. విద్య, వైద్య సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో లేవు. డ్రైనేజి వ్యవస్థలు మెరుగపరచాలి. వంశధార ముంపు బాధితులని ఆదుకోవాల్సిన అవసరముంది. రాజకీయంగా వస్తే ఎమ్మెల్యేగా శాంతి బలం మాత్రం పెంచుకోలేదు. రెండున్నర ఏళ్ళు అయినా సరే ఆమె నియోజకవర్గంపై పట్టు తెచ్చుకోలేదు.
ఇటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వేగంగా పుంజుకుంటున్నారు. ఇక్కడ టీడీపీని బలోపేతం చేస్తున్నారు. తాజాగా హీరామండలం జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికలో టీడీపీ సత్తా చాటింది. ఆఖరికి ఈ స్థానంలో ఎమ్మెల్యే కుమారుడు శ్రావణ్ వైసీపీ తరుపున పోటీ చేసిన గెలుపు దక్కలేదు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఒక సామాన్య కార్యకర్త విజయం సాధించారు. అంటే వైసీపీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో రెడ్డి శాంతికి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.