ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న అజ్ఞాత‌వాసి సినిమా బుధవారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంగ‌ళ‌వారం నుంచే అజ్ఞాత‌వాసి మానియా మొద‌లైపోయింది. ముందుగా ఏపీ ప్ర‌భుత్వం ప‌న‌వ్‌పై అమిత‌మైన ప్రేమ చూపుతూ మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచే ప్రీమియ‌ర్ షోల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంతో పాటు వారం రోజుల పాటు ప్ర‌తి రోజూ రోజుకు 7 షోలు వేసుకునేందుకు అనుమ‌తులు ఇచ్చింది.

 మాస్‌కే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్

సీఎం చంద్ర‌బాబు ఏకంగా ఈ ఫైలుపై సంత‌కం చేసి ప‌వ‌న్ అభిమానుల్లో జోష్ నింపారు. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే భ‌ద్ర‌తా కార‌ణాల వ‌ల్ల కేసీఆర్ ప్ర‌భుత్వం అర్ధ‌రాత్రి షోల‌కు అనుమ‌తులు ఇవ్వ‌లేదు. హైద‌రాబాద్‌లోని భ్ర‌మ‌రాంబ‌, మ‌ల్లిఖార్జున‌, శ్రీరాములు థియేట‌ర్ల‌లో బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమ‌తులు కోర‌గా ఇవ్వ‌లేదు. దీంతో బుధ‌వారం ఉద‌యం 8 గంట‌ల నుంచే తెలంగాణ‌లో అజ్ఞాత‌వాసి హ‌డావిడి స్టార్ట్ అవుతోంది.

 మాస్‌కు పవన్ పండుగే

ఇక అజ్క్షాత‌వాసి వ‌ర‌ల్డ్ వైడ్‌గా 2700 థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమాను 576 స్క్రీన్ల‌లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు. భారీ ఎత్తున ప్రీమియ‌ర్లు ప్లాన్ చేశారు. ఓవ‌ర్సీస్‌లో ఓ తెలుగు సినిమా ఈ రేంజ్‌లో రిలీజ్ అవ్వ‌డం రికార్డు. ఈ సినిమాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 125 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. అంటే సినిమా కొన్న బ‌య్య‌ర్లు సేఫ్ జోన్‌లోకి రావాలంటే రూ.130 కోట్ల షేర్ రావాలి...అంటే సుమారుగా రూ.200 కోట్ల పైన గ్రాస్ వ‌సూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. మ‌రి ఈ బిగ్ టార్గెట్‌ను అజ్ఞాత‌వాసి ఎలా చేధిస్తాడో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: